
రాయచోటి టౌన్ ; నేరాలకు అడ్డుకట్ట వేసి కేసుల దర్యాప్తులో పురోగతి సాధించాలని ఎస్‌పి బి.కృష్ణారావు అన్నారు. గురువారం స్థానిక డిపిఒలో జిల్లాలోని డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రత్యేకించి పలు షీట్స్, గ్రేవ్ కేసులు, పీడీ యాక్టు, ఇతర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల్లో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్‌తో పురోగతి సాధించి పరిష్కరించాలని తెలిపారు. కోర్డులో స్పీడ్ ట్రయిల్ మానిటరింగ్ ద్వారా షీట్స్‌లోని నిందితులకు తగిన శిక్షపడేలా కషి చేయాలని చెప్పారు. ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకోని రికవరీ శాతాన్ని పెంచాలన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసి చట్ట వ్యతిరేక, అసాంఘీక కార్యక్రమాలను కట్టడి చేయాలని సూచించారు. దసరా నవరాత్రులు నేపథ్యంలో జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లో పరిధిలో పలు షీట్స్‌లోని కేసులను సమీక్షించి, తీవ్ర నేరాలతో వున్న షీట్స్ లోని కేసుల దర్యాప్తు వివరాలు, కోర్ట్‌లో ఛార్జిషీట్ ధాఖలు, ప్రస్తుతం కోర్టులో ట్రయల్ ఏ దశలో ఉన్నాయి వంటి వివరాలు అడిగి తెలుసుకొని, సంబంధిత సీడీ ఫైల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. కోర్ట్‌లో స్పీడ్ ట్రయిల్ మానిటరింగ్ ద్వారా షీట్స్ లోని నిందితులకు తగిన శిక్షపడే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. తీవ్ర నేరాల షీట్స్‌లోని వారిపై నిరంతర నిఘా ఉంచాలని తెలిపారు. యాక్టీవ్‌గా ఉన్న వారిని బైండ్ ఓవర్ చేయాలని సూచించారు. హత్య, రేప్, పోక్సో, ప్రాపర్టీ, గంజాయి మున్నగు గ్రేవ్ కేసుల్లో దర్యాఫ్తు, ముద్దాయిలు అరెస్టులపై సర్కిల్ వారీగా పోలీసు అధికారులను ఆరా తీసి, అపరిష్కతంగా ఉన్న గ్రేవ్ కేసుల్లో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్‌తో పురోగతి సాధించి పరిష్కరించాలని పేర్కొన్నారు. కేసు నమోదు నుండి ఛార్జిషీట్ వరకు ప్రతి విషయా న్నికూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలని పేర్కొన్నారు. కేసుల చేదనలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించాలని తెలిపారు. పెరుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. గుడ్ ట్రయల్ మానిటరింగ్ ద్వారా కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చూడాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. వాహన తనిఖీలు చేపట్టి చలానాలు విధిస్తూ వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించేలా చేయాలని పేర్కొన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్క్‌పై దష్టి సారించాలని తెలిపారు. రాత్రి గస్తీ పెంచి ఆస్తి నేరాలు జరిగే ప్రాంతాలపై నిఘా ఉంచి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. చోరీ సొత్తు రికవరీ పెంచాలన్నారు. శాంతి భద్రతలు విఘాతం కల్గిస్తూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఎక్కువ కేసుల్లో వున్న వారిపై పీడీ చట్టం ప్రకారం చర్యలు తీసుకొనుటకు ప్రతిపాదనలు పంపాలని పేర్కొన్నారు. రానున్న దసరా నవరాత్రులు నేపథ్యంలో జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు, క్షేత్రాలు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పటిష్ట బందోబస్టు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని తెలిపారు. వారి సమస్యలను ఓపికగా వినాలని తెలిపారు. చట్ట పరిధిలో న్యాయం చేయాలని చెప్పారు. ప్రజల్లో పోలీసు శాఖపై నమ్మకం కలిగే విధంగా సేవలు అందించాలని పేర్కొన్నారు. వారితో స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్‌పి డాక్టర్ బి.బి.రాజ్ కమల్ గారు, డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలు, డిపిఒ సిబ్బంది పాల్గొన్నారు.