కేసీకి నీరు ఇవ్వలేని ఎంపీ, ఎమ్మెల్యే రాజీనామా చేయాలి..
చేతకాకపోతే క్రాఫ్ హాలిడే ప్రకటించండి
నిర్లక్ష్యం చేస్తే ముచ్చుమర్రి లిఫ్టు ముట్టడిస్తాం
వామపక్ష రైతు సంఘాల హెచ్చరిక
ప్రజాశక్తి - నందికొట్కూరు
నందికొట్కూరు నియోజకవర్గంలో 80 శాతం మంది రైతాంగం కేసి కెనాల్ ఆయకట్టు రైతులు ఉన్నారని జూన్ మాసంలో విడుదల చేయాల్సిన నీరు ఆగస్టు మాసంలో పూర్తి అవుతున్న విడుదల చేయకపోవడం వల్ల అధికారుల మాటలు విని అరతడి పంటల వేసిన రైతులు పంట ఎండిపోయి పూర్తిగా నష్టపోయారని వర్రీ రైతుల పరిస్థితి అగమ్య గొచరంగా తయారైందని, నందికొట్కూరు నియోజకవర్గ రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న ఎమ్మెల్యేలు ఎంపీలు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని లేని పక్షంలో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతామని సిపిఐ జిల్లా నాయకులు వి. రఘురామ్మూర్తి, ఎం.రమేష్ బాబు రైతు సంఘం జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, రాజులు,హెచ్చరించారు. బుధవారం నందికొట్కూరు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం ఆర్డిఓ దాసు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రైతులు మాధవ నాయుడు, రంగస్వామి. ఏఐ ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం.శ్రీనివాసులు.తాలుకా నాయకులు వీరేంద్ర, రైతులు నాగరాజు,నాగన్న,రాజు తదితరులు పాల్గొన్నారు.










