అందరూ కొత్తవారైతే ముఖ్యమంత్రి పినరయి వ్యక్తిగత ప్రాబల్యం పెరిగిపోతుందనే విశ్లేషణలు వాస్తవానికి కమ్యూనిస్టు పార్టీ పని పద్ధతిని తప్పుగా చూపే ప్రయత్నాలు మాత్రమే. కొత్తగా మంత్రులైన వారెవరూ పార్టీకి, రాజకీయాలకు కొత్తవారు కాదు. దీర్ఘకాలంగా వున్న వారే. బాలగోపాల్, రాజీవ్ రాజేశ్, వీణా జార్జి, బిందు వంటి వారంతా ప్రజా జీవితంలోనూ ఉద్యమంలోనూ సేవలందించిన వారే. సంస్థాగతంగానూ ప్రజా ప్రతినిధులుగానూ సమర్థత నిరూపించుకున్నవారే. కె.కె. శైలజ కూడా ఈ నిర్ణయంపై స్పందన అడిగినపుడు 'గతసారి మంత్రినైనప్పుడు నేను కొత్తదాన్నే కదా...' అని చక్కటి సమాధానమిచ్చారు. వీరిలో అత్యధికులు యువత కావడం స్వాగతించదగిన విషయం.
కేరళలో పినరయి విజయన్ నాయకత్వాన ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం వరుసగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసింది. నలభై ఏళ్లలో తొలిసారి అక్కడ ఒక ప్రభుత్వం మళ్లీ విజయం సాధించడం చారిత్రాత్మక విజయంగా పరిగణిస్తున్నారు. 1957లో ఇంఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వాన ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం నుంచీ తర్వాత ఎల్‌డిఎఫ్ ప్రభుత్వాల వరకూ ఏదీ మళ్లీ గెలిచిందిలేదు. 1982 నుంచి ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్ లు ఒకదాని తర్వాత ఒకటి గెలవడమే జరుగుతూ వస్తున్నది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఎల్‌డిఎఫ్ ఒక స్థానం తప్ప అన్నీ కోల్పోయింది. దానికి ముందు తర్వాత తుపాన్లు, శబరిమలై వివాదం నుంచి సిబిఐ, ఐఎన్‌ఎ ల దాకా రాజకీయ కుట్రలూ కుత్సితాలు పినరయి ప్రభుత్వానికి పెనుసవాళ్లుగా మారాయి. కోవిడ్-19 ను ఎదుర్కోవలసి వచ్చింది. రాజకీయంగా పాలనాపరంగా సమర్థవంతమైన కృషి, సహనం, సంయమనం మేళవింపుతో వీటన్నిటినీ జయప్రదంగా అధిగమించి ఆ ప్రభుత్వం మరోసారి ప్రజల విశ్వాసం పొందింది. గత దశాబ్ది వరకూ వామపక్షాలకు కంచుకోటగా వున్న పశ్చిమ బెంగాల్‌లో సిపిఎం కు ఒక్క స్థానం కూడా రాని ప్రతికూల పరిస్థితుల్లో కేరళలో అపూర్వమైన మలి విజయం వామపక్షాల మనోధృతిని నిలబెట్టడం లోనూ ఆ శక్తుల స్థానాన్ని చాటడంలోనూ ప్రత్యేక ముద్ర వేసింది. మోడీ ప్రభుత్వ నిరంకుశ పోకడలు మతతత్వ రాజీయాల నేపథ్యంలో కమ్యూనిస్టులేే గాక ప్రత్యామ్నాయ ప్రజా రాజకీ యాలు ప్రజాస్వామ్య లౌకిక విలువలు కాపాడ బడాలని కోరుకునే ప్రతివారూ కేరళ విజయాన్ని ఆహ్వానించారు. ముఖ్యమంత్రి తప్ప పూర్తిగా కొత్తవా రినే మంత్రివర్గంలో చోటు కల్పించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు 11 మంది కొత్తవారు మంత్రులుగా నియమితులయ్యారు. సిపిఐ మంత్రులు నలుగురూ కొత్తవారే బాధ్యతలు తీసుకున్నారు.
ప్రతిపక్షం అక్కసు, ప్రపంచ ప్రశంస
20వ తేదీన ప్రమాణ స్వీకారం 500 మందితో నిరాడంబరంగా జరిగింది. అయినా ఈ ప్రమాణ స్వీకారం వర్చ్యువల్ పద్ధతిలో జరపాలంటూ సుప్రీంకోర్టులో కేసు వేశారు. కోవిడ్‌ను సాకుగా చూపి యుడిఎఫ్ బహిష్కరించింది. వివిధ మతాల, తరగతుల ప్రతినిధులు కూడా ఆ వేడుకలో పాల్గొనడం కేరళ సామాజిక స్వరూపాన్ని సమ్మిళిత రాజకీయ విధానాన్ని ప్రతిబింబించింది. ప్రమాణ స్వీకారం తర్వాత ఉన్నప్ర వాయిలార్ అమరవీరుల స్మారక చిహ్నం దగ్గర జోహారులర్పించిన మంత్రివర్గం కేరళ దీర్ఘకాలిక అభివృద్ధికి తగు విధానాలు రూపొందించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా కేరళ సమాచార ప్రసార శాఖ, మీడియా అకాడమీ రూపొందించిన సుదీర్ఘ సంగీత విభావరిలో ప్రసిద్ధ గాయనీ గాయకులు, నటులు, కళాకారులు మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి అగ్రతా రలు పాల్గొని ఈ విజయాన్ని మనసారా అభినందించడమే గాక కొత్త ప్రభుత్వం కేరళను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకుపోగలదనే విశ్వాసం ప్రకటించారు. అంతర్జాతీయంగానూ చైనా, వియత్నాం, పాకిస్తాన్, ఐర్లాండ్, శ్రీలంక తదితర అనేక దేశాల కమ్యూనిస్టు పార్టీలు, వర్కర్స్ పార్టీలూ ఈ గెలుపును అభినందిస్తూ సందేశాలు పంపాయి.
నూతనత్వానికి చోటు అన్యాయమట !
అయితే మీడియాలో కొంతమంది వ్యాఖ్యాతలు, మరికొంత మంది కమ్యూనిస్టు వ్యతిరేక రాజకీయ శక్తుల దృష్టిలో ఇదంతా ప్రధానం గాకుండా పోయింది. గత ప్రభుత్వంలో వైద్యశాఖ మంత్రిగా వున్న కె.కె. శైలజను మళ్లీ తీసుకోకపోవడమే ఏకైక ఎజెండాగా మారింది. 'శైలజకు అన్యాయం' అని ఒక తెలుగు పత్రిక శీర్షికనే ఇచ్చింది. వామపక్ష శ్రేయోభిలాషులలోనూ కొంతమందిపై ఈ ప్రచార ప్రభావం పడుతుండొచ్చు. కరోనా పై జరిగిన పోరాటంలో నిరోధంలో శైలజ టీచర్ సమర్థంగా పని చేసి అంతర్జాతీయంగానే అభినందనలు పొందిన మాట నిజమే. అయితే ఆమెను కావాలని తప్పించినట్టు చేసే వ్యాఖ్యానాలు పూర్తిగా అవాస్తవికమైనవే గాక నిరాధారమైనవి. ఆమెతో పాటు గత మంత్రివర్గంలో వున్న టి.రామకృష్ణన్, పి.రామకృష్ణన్, ఎం.ఎం. మణి, కడంపల్లి సుధీరన్, సి. రవీంద్రనాథ్, ఎ.సి. మొయిద్దీన్‌లు కూడా ఈ కొత్త ప్రభుత్వంలో లేరు. దేశమంతటికీ తెలిసిన ఆర్థిక మంత్రి థామస్ ఐసాక్, ఇ.పి జయరాజన్ వంటి వారు ఎన్నికలలోనే పోటీ చేయలేదు. ఇప్పటికే రెండుసార్లు ఎన్నికల్లో గెలిచిన వారు మళ్లీ పోటీ చేయడం వద్దన్న సిపిఎం రాష్ట్ర కమిటీ నిర్ణయం దీనికి కారణమైంది. దీనివల్ల ఎన్నికలలో ఎల్‌డిఎఫ్ దెబ్బ తినవచ్చునని ఆ సమయంలో జోస్యాలు చెప్పినవారు ఎలా దెబ్బ తిన్నారో ఫలితాలు తేల్చాయి. అదే విధంగా మంత్రివర్గంలో పూర్తిగా కొత్తవారిని తీసుకోవాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అందరూ కొత్తవారైతే ముఖ్యమంత్రి పినరయి వ్యక్తిగత ప్రాబల్యం పెరిగిపోతుందనే విశ్లేషణలు వాస్తవానికి కమ్యూనిస్టు పార్టీ పని పద్ధతిని తప్పుగా చూపే ప్రయత్నాలు మాత్రమే. కొత్తగా మంత్రులైన వారెవరూ పార్టీకి, రాజకీయాలకు కొత్తవారు కాదు. దీర్ఘకాలంగా వున్న వారే. బాలగోపాల్, రాజీవ్ రాజేశ్, వీణా జార్జి, బిందు వంటి వారంతా ప్రజా జీవితంలోనూ ఉద్యమంలోనూ సేవలందించిన వారే. సంస్థాగతం గానూ ప్రజా ప్రతినిధులుగానూ సమర్థత నిరూపించుకున్నవారే. కె.కె.శైలజ కూడా ఈ నిర్ణయంపై స్పందన అడిగినపుడు 'గతసారి మంత్రినైనప్పుడు నేను కొత్తదాన్నే కదా...' అని చక్కటి సమాధాన మిచ్చారు. వీరిలో అత్యధికులు యువత కావడం స్వాగతించదగిన విషయం. సిపిఎం లో యువత లేదనీ పాత వారి మాటే చెల్లుతుందని ప్రచారం చేసేవారే కేరళ కమిటీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని తప్పు పట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వాస్తవానికి మేయర్లుగా చిన్నవారిని ఎంపిక చేయడంతోనే ఈ ప్రక్రియ మొదలైంది. పార్టీలలో పాలనలో సమాజంలో తరాల మార్పును క్రమబద్దంగా ప్రోత్సహించడం ఒక బాధ్యతాయుత కర్తవ్యం.
ముందే మొదలైన ప్రచారం
వ్యవస్థాగతమైన నిర్ణయాలను వ్యక్తిగత కోణంలోకి మరల్చి కుశంకలు లేవనెత్తడం సహృదయులు హర్షించరు. కేవలం కె.కె. శైలజను మళ్లీ మంత్రిగా తీసుకోలేదనే ఒక్క అంశంపై శీర్షికలు ఇవ్వడం అలాంటి వ్యవహారమే. అప్పుడూ ఇప్పుడూ ఆమె సమిష్టి నిర్ణయాలలో భాగస్వామిగానే వుంటారు. ఆమె సలహాలు తీసుకుంటానని కొత్త మంత్రి వీణా జార్జి చెప్పారు కూడా. ఆమెకు మాత్రమే మినహాయింపు ఇవ్వడమంటే అప్పటి ఇతర సహచరుల సంగతేమిటి? అందుకే అలా చేయలేకపోయామని పినరయి సూటిగానే వివరించారు. నిజానికి కేరళ మీడియాలో కొందరు గౌరి అమ్మ మరణించిన నాటి నుంచే ఈ మీమాంస లేవదీశారు. సీనియర్ నాయకురాలైన గౌరీ అమ్మ ఒక దశలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు తొలగించినా ఆమె యుడిఎఫ్‌లో మంత్రిగా చేసినా ఆఖరి దశలో ఆ శక్తులతో విడగొట్టుకుని పాత ఒరవడికి దగ్గరయ్యారు. 1987లో గౌరి ముఖ్యమంత్రి అవుతారనే ఊహాగానాలతో మీడియా పతాక శీర్షికలివ్వడం వాటి ప్రచారమే. పార్టీ కమిటీ సమిష్టిగానే అప్పట్లో నయనార్‌ను ఎన్నుకున్నది. బోడిగుండుకూ మోకాలికి ముడి పెట్టినట్టు మహిళ అనే కోణంలో గౌరియమ్మ వ్యవహారానికి ఇప్పటి మంత్రివర్గంలో శైలజ లేకపోవడానికి పోలిక తేవడానికి పాకులాడుతున్నది. శశిథరూర్, మురళీధరన్ వంటి కాంగ్రెస్ నేతలకు శైలజ టీచర్‌పై ఎక్కడలేని అభిమానం పుట్టుకొచ్చింది. ఇది పార్టీ నిర్ణయమని ఆమెనే ప్రకటించడం వల్ల వారి పాచికలు పారలేదు. మీడియాలో కొందరు శైలజ విషయంలో కేంద్ర నాయకత్వం కూడా అసంతృప్తిగా వుందని కూడా కథలు రాస్తున్నారు. సిపిఎం కేంద్రీకృత ప్రజాస్వామ్య పద్ధతిని ప్రత్యర్థులు ఎంతగా వక్రీకరించినా కాంగ్రెస్, బిజెపి లేదా ప్రాంతీయ పార్టీలలో వలె ఏ ఒక్కరో నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. నిజానికి శైలజ విషయంతోనే ప్రచారాలు ఆగలేదు. గతం నుంచి డివైఎఫ్‌ఐ అధ్యక్షుడుగా వున్న రియాజ్ మంత్రి అయితే...ఆయన ముఖ్యమంత్రి అల్లుడు కావడం గురించే మీడియా రాసింది. ఆర్‌ఎస్‌ఎస్ వాదులైతే మరో అడుగు ముందుకేసి ఇస్లామిక్ శక్తులకు ప్రభుత్వంలో చోటు కల్పించినట్టు వికృతారోపణలు చేశారు. కులం కోణాలు రాసినవారూ వున్నారు. ఇవన్నీ ఎల్‌డిఎఫ్ చారిత్రిక విజయం నుంచి దృష్టి మరల్చే దుష్ట యత్నాలే.
ఆచరణే సమాధానం
దేశంలో పాలక వర్గాల పైన, బిజెపి మతతత్వం పైనా కాంగ్రెస్ దివాళాకోరు పోకడల పైనా పోరాటానికి, వామపక్ష భావజాలానికి, ప్రత్యామ్నాయ శక్తులకు ముందు నిలిచే సిపిఎం... బడా మీడియాకు ఎప్పుడూ కంటగింపుగానే వుంటుంది. గతంలో తెలుగు నాట సుందరయ్య, బసవపున్నయ్యల పైన... జాతీయంగా లోగడ జ్యోతిబసు, హరికిషన్ సింగ్ సూర్జిత్, ప్రకాశ్ కరత్, సీతారాం ఏచూరి...ఇలా పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న వారిపైన ఆయా సమయాలలో ఏవో కట్టుకథలు, ప్రచారాలు సాగిస్తూ విశ్వాసం దెబ్బ తీయడానికి, తికమక పెట్టడానికి అటు బడా మీడియా ఇటు పాలకవర్గ నేతలు తంటాలు పడుతూనే వుంటారు. కేరళలో ఎల్‌డిఎఫ్ ఘన విజయం ముందు నుంచే వారి దాడి పినరయిపై కేంద్రీకృతమైంది. 'మోడీ ఇన్ మండు' (పంచెలో మోడీ) అని చిత్రిస్తూ అన్నిటికీ ఆయనే కారణమనీ ఆయన ఆధిపత్యమే సాగుతున్నదని మీడియా ప్రచారం చేస్తున్నది. తెలుగులోనూ పునర్ముద్రితమైన 'పీపుల్స్ డెమోక్రసీ' ఎడిటోరియల్ ఆయన గురించి సాగే ఈ ప్రచారాలను స్పష్టంగా తోసిపుచ్చింది. నాయకుడుగా ఆయన పాత్ర కీలకమని చెబుతూనే సమిష్టి విజయంగా కేరళ తీర్పును అభివర్ణించింది. ఆ విధమైన సమిష్టి నిర్ణయాల ద్వారా తప్పొప్పులు సమీక్షించుకుంటూ ఆ ప్రభుత్వం మరిన్ని విజయాలు సాధించగలదనడంలో సందేహం అక్కర్లేదు.
తెలకపల్లి రవి











