
ప్రజాశక్తి - వేటపాలెం
స్థానిక సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాల పిట్టలవానిపాలెం కెర్ యోగా నేచురోపతిక్ మెడికల్ కళాశాల యాజమాన్యంతో అవగాహనా ఒప్పందం చేసుకున్నట్లు కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తంగా శుక్రవారం తెలిపారు. తమ కళాశాల విద్యార్థులకు యోగా, మానసిక ఒత్తిడి నియంత్రణ (స్ట్రెస్ మేనేజ్మెంట్), జీవన విధాన నిర్వహణపై శిక్షణ ఇచ్చుటకు అవగాహనా ఒప్పందం కుదిరినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎం వేణుగోపాలరావు చెప్పారు. ఈ అవగాహన ఒప్పందం క్రింద విద్యార్థులకు మానసిక ఓత్తిడిని ఎదుర్కొనుటకు అవసరమైన యోగా శిక్షణ, మానసిక ఆరోగ్యం పెంపొదించుటకు అవసరమైన సూచనలు, సలహాలు కేర్ యోగా నేచురోపతిక్ మెడికల్ కాలేజి వారు అందజేస్తారని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన యోగా శిక్షణపై ప్రణాళికను రూపొందించి యోగ శిక్షణ ఇవ్వనున్నట్లు కెర్ యోగా నేచురోపతిక్ మెడికల్ కాలేజి ప్రెసిడెంట్ వి రాధాకృష్ణ, కరస్పాండెంట్ వి కిషోర్ కుమార్, ప్రిన్సిపాల్ ఎన్ జయలక్ష్మి, అడ్మిన్ ఇన్చార్జి పి నాగేశ్వరరావు తెలిపారు. ఈ శిక్షణలో యోగాసనాలు, వివిధ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, రిలాక్సేషన్ పద్ధతులు, మానసిక ఒత్తిడి నియంత్రణకు కావలసిన పద్దులను విద్యార్థులకు శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ మేరకు ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.