Oct 08,2022 23:07

వివరాలను వెల్లడిస్తున్న ఆసుపత్రి ప్రతినిధులు

ఒకేసారి లివర్‌, కిడ్నీ మార్పిడి చికిత్స విజయవంతం
ప్రజాశక్తి- కలెక్టరేట్‌
: నగరంలోని కేర్‌ హాస్పిటల్‌లో అత్యంత అరుదైన లివర్‌, కిడ్నీ అవయవ మార్పిడికి ఆపరేషన్‌ను ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించి రికార్డు సష్టించింది.ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చికిత్స అత్యంత అరుదైనదని, సుమారు 50 మందికి పైగా వైద్యబృందంతో 18 గంటల పాటు సుదీర్ఘ అవయవ మార్పిడి ఆపరేషన్‌ నిర్వహించామని ఎపి జీవన్‌దాన్‌ చీఫ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ కోఆర్డినేటర్‌, విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రాంబాబు తెలిపారు. శనివారం కేర్‌ హాస్పటల్‌లో మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బి. తాతాజీ అత్యంత అరుదైన జన్యుపరమైన ప్రైమరీ హైపరొకాలురియా అనారోగ్య సమస్యతో బాధపడుతూ, ఏడాది క్రితం కేర్‌ హాస్పిటల్స్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్ట్‌, ట్రాన్స్‌ప్లాంట్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ ఎవి. వేణుగోపాల్‌ను సంప్రదించారు. కాలేయం నుండి విడుదలయ్యే ఒక ఎంజైమ్‌ వల్ల తరచూ కిడ్నీలో రాళ్ళు ఏర్పడి, కిడ్నీ పూర్తిగా పాడవ్వడానికి దారి తీస్తుందని గుర్తించి, ఒకేసారి కిడ్నీ, కాలేయ మార్పిడి చేయాలని డాక్టర్‌ వేణుగోపాల్‌ రోగి తల్లిదండ్రులకు వివరించారు. ఏడాదిగా డయాలసిస్‌ చికిత్స పొందుతున్న రోగికి, ఒకే సమయంలో అత్యంత క్లిష్టతరమైన లివర్‌, కిడ్నీ మార్పిడి చికిత్సకు జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేయగా, అవయవాలు సమకూరడంతో కేర్‌ హాస్పిటల్స్‌ ఛీఫ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌ డాక్టర్‌ మహ్మద్‌ నయీమ్‌ నేతత్వంలో డాక్టర్‌ కె.రవిశంకర్‌, డాక్టర్‌ వచన్‌ హుక్కేర్తి, డాక్టర్‌ యుక్తానీల బృందం తాతాజీకి కాలేయ మార్పిడిని, డాక్టర్‌ ఎ.వి.వేణుగోపాల్‌ నేతత్వంలోని డాక్టర్‌ సి.హెచ్‌.సుబ్బారావు, డాక్టర్‌ హరిణి బృందం కిడ్నీ మార్పిడిని ఒకేసారి విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. 18 గంటలు పైగా నిర్వహించిన అరుదైన ఆపరేషన్‌ విజయవంతం కావడం, రోగి కోలుకోవడంతో వైద్యనిపుణుల బృందానికి ఆసుపత్రి చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ వద్దిపర్తి అభినందనలు తెలిపారు. అవయవ మార్పిడికి సహకరించిన ఆంధ్రప్రదేశ్‌ జీవనాన్‌ ఛీఫ్‌ ట్రాన్స్‌ ప్లాంట్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.రాంబాబుకు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. బ్రెయిన్‌ డెడ్‌ రోగులు తమ అవయవాలను చట్టపరంగా జీవన్‌దాన్‌లో దానం చేయవచ్చని, అది ఇతరులకు ప్రాణదానం చేస్తుందన్నారు.