ప్రజాశక్తి-రెడ్డిగూడెం: రెడ్డిగూడెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, ఆరోగ్యకేంద్ర పరిధిలోని అన్ని హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలలో, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా కేన్సర్ గురుంచి అవగాహనా సైకిల్ ర్యాలీ, స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. రెడ్డిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ సందేశ్, డాక్టర్ చెన్నకేశవ ఆధ్యర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రజాశక్తి-పెనుగంచిప్రోలు : మండల కేంద్రంలో ఆయుష్మాన్ భారత్, సైకిల్ ఫర్ హెల్త్ కార్యక్రమాన్ని స్థానిక వైద్యాధికారిణి ఇందిర ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వేల్పుల పద్మకుమారి, ఎఎన్‌ఎమ్‌లు, ఆశ వర్కర్లు, విద్యార్థులు గ్రామంలో సైకిల్ ర్యాలీ నిర్వహించి కేన్సర్ వల్ల వచ్చే అనార్ధలపై అవగాహన కల్పించారు. ప్రజాశక్తి-తిరువూరు: తిరువూరు మండలం రాజుగూడెంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నరసింహనాయక్ ఆధ్వర్యంలో కేన్సర్ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజాశక్తి-భవానీపురం: కేన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి అన్నారు. మంగళవారం లేబర్ కాలనీలోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం డాక్టర్ వసుంధర ఆధ్వర్యంలో కేన్సర్‌పై అవగాహన కల్పిస్తూ జిఎన్‌ఆర్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.










