ప్రజాశక్తి-పంగులూరు: క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించుకోవాలని, ముందుగా గుర్తిస్తే క్యాన్సర్‌ను నిర్మూలించవచ్చు అని, హెచ్‌సిజి క్యాన్సర్ సెంటర్ మార్కెటింగ్ మేనేజర్ వై వినీల్ కుమార్ అన్నారు. స్థానిక పంగులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద హెచ్‌సిజి క్యాన్సర్ సెంటర్ ఒంగోలు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండాలని, చెడు వ్యసనాల వల్ల క్యాన్సర్ బారినపడే అవకాశం వుందని అన్నారు. తమ హెచ్‌సిజి క్యాన్సర్ ఆసుపత్రిలో క్యాన్సర్‌కు సంబంధించిన అన్ని రకాల పరీక్షలతో పాటు, క్యాన్సర్ చికిత్సలను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంగులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ మల్లిఖార్జునరావు, హెల్త్ ఎడ్యుకేటర్ అనురాధ, సచివాలయ ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది మరియు హెచ్‌సిజి క్యాన్సర్ సెంటర్ అసిస్టెంట్ మేనేజర్ మెహర్ కుమార్ పాల్గొన్నారు.










