మదనపల్లె అర్బన్ : కేన్సర్ బాధితుల మోహల్లో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్ డోనేషన్ కార్యక్రమానికి మహిళలు, అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేస్తున్నారు. శుక్రవారం పట్టణంలోని నీరుగట్టువారిపల్లికి చెందిన పెంచ లయ్య, సరళల కుమార్తె చందన ప్రియ కేన్సర్ బాధితుల కోసం తన కేశాలను దానం చేసింది. ఆమెకు ప్రశంస పత్రంతో పూలమొక్క బహుకరించి అభినం దించిన హెల్పింగ్ మైండ్స్ సభ్యులు అర్షియా. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ కేన్సర్ బాధితుల కోసం గొప్ప మనసును చాటుకుంటున్న చిన్నారులు,యువతులు, మహిళల సేవలు అభినందనీయమని ఇప్పటికి 35 మంది కేశాలు దానం చేసారని, రాష్ట్ర వ్యాప్తంగా కేన్సర్ భాదితులకు ఉచితంగా విగ్గులు తమ సంస్థ అందిస్తుందని పేర్కొన్నారు. హెయిర్ డోనార్ చందన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాల్లో ముందు ఉండాలని, కేశాలు దానం చేయడానికి తన తల్లిదండ్రులు సైతం ప్రోత్సహం అందించారని తెలిపారు. కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు చాను, అమీన్, కిరణ్ పాల్గొన్నారు.
చందన ప్రియకు సర్టిఫికెట్ ఇస్తున్న అర్షియా










