Apr 18,2023 23:29

పిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు అందజేస్తున్న ఎంపీ డాక్టర్‌ సత్యవతి

ప్రజాశక్తి-అనకాపల్లి
కేన్సర్‌ రోగికి మంజూరైన పిఎం రిలీఫ్‌ ఫండ్‌ను మంగళవారం బాధితునికి ఎంపీ డాక్టర్‌ బివి.సత్యవతి అందజేశారు. అనకాపల్లి 83వ వార్డుకు చెందిన జక్కుల కృష్ణ ధనలక్ష్మి దంపతుల కుమారుడు కార్తికేయ బ్లడ్‌ కేన్సర్‌తో బాధపడుతున్నాడు. వైద్య నిపుణులు వెల్లూరు కేన్సర్‌ ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. చికిత్స నిమిత్తం రూ.5 లక్షలు ఖర్చవుతుంది. దీంతో ఆ దంపతులు సహాయం నిమిత్తం పార్లమెంటు సభ్యురాలు డాక్టర్‌ బివి.సత్యవతిని ఆశ్రయించారు. దీనిపై స్పందించి పీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఆమె సిఫార్సు చేయగా, రూ.2.50 లక్షలు మంజూరయ్యాయి. ఈ చెక్కును మంగళవారం ఎంపీ సత్యవతి తన క్యాంపు కార్యాలయంలో బాధితునికి అందజేశారు. ఎంపీ సత్యవతి తక్షణమే స్పందించి ఆర్థిక అందించినందుకు కృష్ణ ధనలక్ష్మి దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు.