Mar 21,2023 01:28
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌ఎంఓ డాక్టర్‌ సుభాషిని

ప్రజాశక్తి-చీరాల: కేన్సర్‌ నియంత్రణకు అన్ని ప్రాంతాల్లోని ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని చీరాల ఏరియా హాస్పిటల్‌ అర్‌ఎంవో డాక్టర్‌ సుభాషిణి పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఏరియా వైద్యశాలలోనీ సమావేశం హాలులో ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దంత వైద్యులు సునయన మాట్లాడుతూ నేటి యువతరం అధిక శాతం మంది వివిధ హానికర మత్తు పదార్థాలతో ప్రాణాంతక బారిన పడుతున్నట్లు వివరించారు. ప్రారంభ దశలో వాటిని గుర్తించినట్లయితే ప్రాణాలు రక్షించవచ్చని అన్నారు.ఈక్రమంలో వచ్చే లక్షణాలను సుదీర్ఘంగా వివరించారు. గ్రామాల్లో విధులు నిర్వహించే ఆరోగ్య సిబ్బంది ఈవిధమైన లక్షణాలు ఉన్నవారిని గుర్తించి స్థానికంగా ఉన్న ప్రభుత్వ వైద్యశాలల ద్వారా వైద్యం సాయం అందించేందుకు కషిచేయాలన్నారు.కార్యక్రమంలో డాక్టర్‌ రవిప్రకాష్‌, డాక్టర్‌ ప్రవీణ, డాక్టర్‌ సంధ్య, డాక్టర్‌ సత్య, జాతీయ టుబాకో ప్రోగ్రామ్‌ మెంబర్‌ రమేష్‌, అన్ని ప్రాంతాల్లోని ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.