
గుంటూరు జిల్లా ప్రతినిధి: కేన్సర్ బారిన పడి చివరి దశలో ఉన్న వారికి సంతోష కర జీవితం అందించేందుకు వాలంటీర్లు పని చేయాలనీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. శనివారం నాట్కో కేంద్రం లో ప్రపంచ ఉపశమన సంరక్షణ దినోత్సవం (పాలియేటివ్ కేర్ డే ) పురస్కరించుకు ని వివిధ విభాగల వైద్యులు, నర్సులు, నర్సింగ్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం లో ఆయన మాట్లాడారు. డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ తో బాధ పడే వారికీ ఆరోగ్య సంరక్షణ సంస్థలు ముందుకు రావాలని సూచిం చారు. అనారోగ్యం తో బాధ పడే రోగులకు ప్రేమ తో వైద్యం అందించాలని ఆయన కోరారు. ప్రాణంతక వ్యాధుల బారిన పడిన వారిని బాధితులకు ఉపశమనం కల్పించేందుకు కషి చేయాలనీ ఆయన చెప్పారు. ఆసుపత్రి కి రాలేని వారి ఇంటికి వెళ్లి సేవలు అందించాలన్నారు. ఆఖరి మజిలీ లో రోగులకు ఎంత సేవా చేసిన సరిపోదన్నారు. అందుకోసం డాక్టర్ జోజిరెడ్డి కుటుంబ సభ్యులు రూ.13 లక్షల వ్యయం గల వాహనాన్ని అందుబాటులో ఉంచడం అభినందనీయ మని అన్నారు. ఈ సందర్భంగా జోజిరెడ్డి సతీమణి డాక్టర్ జ్యోతిని ఘనంగా సన్మానించారు. మెడికల్ కళాశాల ప్రిన్సి పల్ డాక్టర్ టి టి కె రెడ్డి, డాక్టర్ దుర్గ ప్రసాద్, నాట్కో కో ఆర్డినేటర్ వై.అశోక్ కుమార్ ప్రసంగించారు. డా. జోజీ రెడ్డి భార్య డాక్టర్ జ్యోతిని ఘనంగా సత్కరించారు. అనస్థీషియా ప్రొఫెసర్ డాక్టర్ పోలయ్య , డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస ప్రసాద్, డాక్టరు జాహ్నవి , డాక్టర్ వెంకా రెడ్డి , డాక్టర్ మాధురి , డాక్టర్ శ్రీకన్య మానవత సేవా సంస్థ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రాణాంతక వ్యాధిగ్రస్తుల ఇళ్లకే మందులు
ప్రాణంతక వ్యాధి బారిన పడిన బాధితులకు నెల కు సరిపడా మందులు ఇంటికే పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆదేశించారు.శనివారం ఆసుపత్రి సుశృత హాలులో వై ఆర్ జి కేర్, జిజిహెచ్ ఏ ఆర్ టి సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో అమ్మ ట్రస్ట్, రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు, మానవతా సేవా సమితి సహకారం తో చిన్నారులకు పౌష్టికాహార కిట్ల పంపిణి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మందుల కోసం వయో వృద్ధులు, చిన్నారుల తల్లిదండ్రులు డబ్బులు ఖర్చు పెట్టుకుని దూర ప్రాంతాల నుంచి ఆసుపత్రి కి రావడం కష్టతరంగా ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాధిగ్రస్తులకు నేరుగా మందులు అందించే విధంగా కృషి చేయాలని అన్నారు. ఏ ఆర్ టి ఉద్యోగులు అంబులెన్స్ లో వెళ్లి వ్యాధిగ్రస్తులకు మందులను అందించాలని, అందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని తెలిపారు. అనంతరం 60 మంది చిన్నారులకు పౌష్టికాహార కిట్లను అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస ప్రసాద్, రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు అధ్యక్ష కార్యదర్సులు కె వి భాస్కర్, చెరుకూరి శ్రీనివాస రావు, దుర్గా, ముస్తఫా పాల్గొన్నారు.