Jun 17,2023 00:08
బాధితుడికి వ్యక్తికి చెక్కును అందిస్తున్న రోటరీ అధ్యక్షులు, వైద్యులు

ప్రజాశక్తి-అద్దంకి: కేన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న గ్రామీణ ఆర్‌ఎంపి తాళ్లూరి సత్యనారాయణకు శుక్రవారం రోటరీ క్లబ్‌ ఆఫ్‌ సింగరకొండ వారి ఆధ్వర్యంలో 40 వేల రూపాయల చెక్కును అందజేశారు. రోటరీ చార్జర్‌ ప్రెసిడెంట్‌ చదలవాడ ఫణీంద్రబాబు ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్‌ సందిరెడ్డి శ్రీనివాసరావు, తమ్మన శ్రీనివాసరావు సభ్యులు చుండూరి మురళీ సుధాకరరావు చప్పిడి వీరయ్య, నర్రా శ్రీలక్ష్మి, కొల్లా భువనేశ్వరి, కె సురేంద్ర, గంగాధర్‌, సుభాని పాల్గొన్నారు.