Oct 02,2023 20:07

మాట్లాడుతున్న నర్సింగరావు

ప్రజాశక్తి-గుడ్లూరు :రామాయపట్నం ఓడరేవును కేంద్రం నిధులతో నిర్మించాలని రామా యపట్నం పోర్టు అనుబంధ పరిశ్రమలు స్థాపన కోసం పనులు ప్రారంభించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు పేర్కొన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోరుతూ సోమవారం నుంచి మండలంలోని చేవూరులో ఏర్పాటుచేసిన సభలో నరసింగరావు ప్రసంగించారు. ఈ సభకు చేవూరు సిపిఎం కార్యదర్శి నూతలపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ రామాయపట్నం పోర్టు నిర్వాసితులకి పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించి స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. సుమారు 75శాతం ఉద్యోగాలు స్థానికులకే తప్పనిసరిగా కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. పోర్టుకు అనుబంధంగా నిర్మించాలనుకుంటున్న పరిశ్రమలకి ఉన్న భూములు సరిపోతాయని, పరిశ్రమల పేరుతో చేవూరుకు చెందిన రైతుల దగ్గర భూములు లాక్కోవాలని చేసిన ప్రయత్నాలన్నీ అవకాశవాదాన్ని గుర్తించిన సిపిఎం నాయకులు చేవూరు రైతులకు అవగాహన కల్పించడంతో రాజకీయాలకి అతీతంగా చేవూరు గ్రామస్తులందరూ సమైక్యంగా నిలబడి భూములు ఇవ్వకుండా నిరాకరించడంతో పోర్టు నిర్వాహకులు ఆటలు సాగలేదన్నారు. తీరంలో నిర్మిస్తున్న ఓడరేవులకి ప్రజాధనం వేల కోట్లు ఖర్చు చేసి పోర్టు నిర్మాణం పూర్తయ్యాక ఆదానికి అప్పగించడానికి పాలకవర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. దేశంలో నిర్మించిన పోర్టులన్నీ అదాని, అంబానీకి దారా దత్తం చేయడానికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతుందన్నారు. విశాఖపట్నంలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం 1966లో ప్రజలు ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు. పోర్టులు ప్రయివేటుపరం చేయరాదని సిపిఎం నాయకులు ప్రజల తరఫున అలుపెరగని పోరాటాలు చేస్తున్నారన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో పాలకవర్గాలు రైతులని దగా చేస్తున్నారని ఆయన దూయ్యి పెట్టారు రైతులకు ఇష్టం ఉన్న లేకపోయినా అధికారుల ద్వారా రైతులు చేత సంతకాలు పెట్టించుకుని రైతులే భూములు స్వచ్ఛందంగా ఇచ్చారనే ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని ఆయన వివరించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం వలన భూములు కోల్పోయిన నిర్వాసితులు హక్కుల సాధన కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కమిటీ ఏర్పాటు చేసుకొని హక్కుల సాధన కోసం పోరాడాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో కోత విధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు అన్యాయం చేస్తున్నాయన్నారు. కనీసం 200 రోజులు పని దినాలు కల్పించాలని, రోజువారి కూలీ రూ. 600 చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. గుడ్లూరు మండలం, చేవూరులో బహిరంగ సభ అనంతరం పాదయాత్రకి నరసిగరావు జెండా ఊపి ప్రారంభించారు. కందుకూరు డివిజన్‌ సిపిఎం సీనియర్‌ నాయకులు ముప్పరాజు కోటయ్య సిపిఎం కార్యదర్శి గౌసు నెల్లూరు జిల్లా సిపిఎం నాయకులు కావలి సిపిఎం కార్యదర్శి మాదాల కళాకారుల బందం మహిళా సంఘం నాయకురాలు గుడ్లూరు మండలం సిపిఎం కార్యదర్శి కే వెంకయ్య జి స్టాలిన్‌ చేవూరుకు చెందిన సిపిఎం నాయకులు ఇరువురి బ్రహ్మయ్య , నెల్లూరు జిల్లా సిపిఎం కమిటీ సభ్యులు తుళ్లూరు గోపాల,్‌ కత్తి శ్రీను, పసుపులేటి పెంచలయ్య, తాళ్లూరు మాలాద్రి ,ఎస్‌.కె మస్తాన్‌, నబి, కత్తి పద్మ ,ఎస్‌.కె షంషాద్‌, ఎస్‌.కె రహనా బేగం, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శేషయ్య, వేణు ,జిల్లా డివైఎఫ్‌ఐ కార్యదర్శి రమణ, ఎస్‌ కె సుల్తాన్‌, గోసు దయాకర్‌, గుడ్లూరు మండలం సిపిఎం కన్వీనర్‌ జి వెంకటేశ్వర్లు ,ఉలవపాడు మండలం సిపిఎం కన్వీనర్‌ జివిబి కుమార్‌ ,సిపిఎం సీనియర్‌ నాయకులు మద్దిశెట్టి జాలయ్య, దామ కష్ణయ్య ,సుంకర విజయలక్ష్మి ,గుడ్లూరు సిపిఎం కార్యకర్తలు కొట్టే వెంకయ్య, జి స్టాలిన్‌ పాదయాత్రలో పాల్గొన్నవారు,