నిరసన తెలుపుతున్న మహిళా మండలి సభ్యులు
ప్రజాశక్తి - బెల్లంకొండ: మణిపూర్ రాష్ట్రంలో మహిళలపై హింస అత్యంత క్రూరమైనదని గ్రేస్ మహిళా మండలి అధ్యక్షులు దుగ్గి కీర్తన అన్నారు. మండల కేంద్రమైన బెల్లంకొండలో గ్రేస్ మహిళా మండలి ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ప్రదర్శన చేశారు. కీర్తన మాట్లాడుతూ మణిపూర్ ఘటనలో నిందితులపై రాష్ట్ర ప్రభుత్వం కానీ, అక్కడి అధికారులు కానీ చర్యలు తీసుకోకపోవడం దేశంలో మహిళల భద్రతనే ప్రశ్నిస్తోందన్నారు. మణిపూర్‌లో హింసాఖాండను ఆపేందుకు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవలని కోరారు. కార్యక్రమంలో గ్రేస్ మహిళా మండలి సభ్యులు రాధమ్మ, సువార్త, సుశీల, పద్మజ, శైలజ, పాస్టర్ సామ్యూల్ పాల్గొన్నారు.










