రాజంపేట : కేంద్రీయ విద్యాలయలో ముఖ్యమైన మరమ్మతులకు ఎస్టిమేట్ తయారు చేయాలని ఆర్‌అండ్‌బి అధికారులను కలెక్టర్ గిరీష ఆదేశించారు. మంగళవారం సాయంత్రం రాజంపేటలోని కేంద్రీయ విద్యాలయలో కలెక్టర్ అధ్యక్షతన విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు పాఠశాలలో వైట్ వాషింగ్ చేయించడం, బాలబాలికల మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించడం వంటి పలు అంశాల మీద చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలబాలికల మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించడం వంటి ముఖ్యమైన పనులకు ఎస్టిమేట్ తయారుచేసి తన దగ్గరకు తీసుకురావాలని ఆర్‌అండ్‌బి అధికారులను ఆదేశించారు. కేంద్రీయ విద్యాలయలో పాస్ పర్సంటేజీ చాలా బాగా ఉందని తెలిపారు. దీనిని ఇలాగే కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్‌కు సూచించారు. సమావేశంలో రాజంపేట ఆర్‌డిఒ రామకృష్ణారెడ్డి, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.










