Apr 20,2023 23:53

కేంద్ర వ్యతిరేక విధానాలపై కరపపత్రాలు పంపిణీ చేస్తున్న నాయకులు


ప్రజాశక్తి - పిఠాపురం
సిపిఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం స్థానిక నండూరి ప్రసాదరావు భవనం నుంచి మున్సిపల్‌ కార్యాలయం వరకు కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై కరపత్రాల పంపిణీ చేసి పోస్టర్‌ ఆవిష్కరించారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కమిటీ నాయకులు డిఎస్‌ బాబ్జి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తూ కార్పొరేటు సంస్థలకు రాయితీలు ఇచ్చుకుంటూ సామాన్య ప్రజలపై అధిక బారాలు మోపుతొందన్నారు.ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హౌదా ఇవ్వకుండా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను ప్రైవేటీకరణ చేస్తూ ఇటువంటి నిర్ణయాలు తీసుకొస్తున్న బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం ప్రజలు చెబుతారన్నారు. కార్యక్రమంలో నాయకులు కె.చిన్న,విశ్వనాథం, నాగేశ్వరరావు, వీరబాబు, కె.మణి, అర్జునరావు, సూర్యనారాయణ, శ్రీను,మోహనా చార్యులు, సూర్య చక్రం, అప్పారావు, సత్యనారాయణ పాల్గొన్నారు.