Sep 04,2023 23:00

ధర్నాలో మాట్లాడుతున్న తులసీదాస్‌

* జిల్లా వ్యాప్తంగా సిపిఎం నిరసనల హోరు
* ధరలను అదుపు చేయడంలో మోడీ, జగన్‌ విఫలం
* సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తులసీదాస్‌
     కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై సిపిఎం శ్రేణులు కన్నెర్ర చేశాయి. ధరల పెంపు, నిరుద్యోగం, విద్యుత్తు ఛార్జీల భారం తదితర అంశాలపై సిపిఎం కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా సోమవారం తహశీల్దార్‌, మున్సిపల్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టాయి. మోడీ, జగన్‌ వైఫల్యాలను ఎండగట్టాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతూ మోడీ.. జనం నడ్డివిరుస్తున్నారని మండిపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో విద్యుత్తు ఛార్జీలను పెంచి జనంపై భారం మోపుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజలపై పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని, ధరలను అదపు చేయలేని మోడీ వెంటనే గద్దె దిగాలని, పెంచిన విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలని పెద్ద పెట్టున నినాదాలు మిన్నంటాయి.

ప్రజాశక్తి- జిల్లా విలేకరుల యంత్రాంగం : 
నిత్యవసర ధరలు విపరీతంగ పెరుగుతున్నా వాటిని అదుపు చేయడంలో మోడీ, జగన్‌ విఫలమయ్యారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌ అన్నారు. శ్రీకాకుళం మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవల కాలం వరకు టామాట ధరలు విపరీతంగా పెరిగితే... ప్రస్తుతం ఉల్లి ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. వంట నూనెలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అడ్డుఅదుపూ లేకుండా పెరగుతున్నాయన్నారు. వంట గ్యాస్‌ ధర రూ.200లు తగ్గించామని బిజెపి ప్రభుత్వం చెప్తోందని, బిజెపి అధికారంలోకి వచ్చినప్పుడు గ్యాస్‌ ధర రూ.400లు ఉండేదని గుర్తుచేశారు. ప్రజలపై ఇంకా రూ.600 భారం కొనసాగుతోందని చెప్పారు. వంట గ్యాస్‌ను రూ.400కే ఇవ్వాలని, పేద కుటుంబాలకు ఎడాదికి ఆరు సిలిండర్లను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను మోడీ పెంచుతుంటే రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలను పెంచుతోందని విమర్శించారు. ట్రూ అఫ్‌, ఫ్యూయల్‌ పర్చేజ్‌ సర్దుబాటు పేర్లతో యూనిట్‌ విద్యుత్‌కు రూ.1.20 పైసలు నుంచి రూ.1.40 పైసల వరకు వసూలు చేస్తోందని చెప్పారు. మోడీ, జగన్‌కు వ్యతిరేకంగా సాగిస్తున్న ఆందోళనలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నగర కమిటీ కన్వీనర్‌ టి.తిరుపతిరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, ఎ.సత్యనారాయణ, ఎం.గోవర్థన్‌, ఎం.ఆదినారాయణమూర్తి, ఎల్‌.మహేష్‌, జానకమ్మ, ఎ.లక్ష్మి, అసిరినాయుడు, ఎల్‌.రాజు, జి.రమణ, సావిత్రమ్మ, పార్వతమ్మ, కాంతమ్మ, అప్పారావు పాల్గొన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు పిలుపునిచ్చారు. ఎచ్చెర్ల తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.తేజేశ్వరరావు, టి.నందోడు, ఎన్‌.వి.రమణ, పి.దుర్గాప్రసాద్‌, డి.బంగార్రాజు, టి.రామారావు, వై గోపాలుడు, ఎల్‌.అశోక్‌, కె.అప్పన్న, పి.కవిలేశ్వరరావు, సీతారాం పాల్గొన్నారు.
గార తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గంగరాపు సింహాచలం, కె.చంటి, కె.అప్పారావు, సిర్ల శ్రీరాములు, పెయ్యల రామారావు, ఆదిలక్ష్మి, బర్రి అప్పలనర్సమ్మ, లక్ష్మణరావు, రాజారావు పాల్గొన్నారు.
రణస్థలం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో సిపిఎం నాయకులు వెలమల రమణ, సిహెచ్‌.అమ్మన్నాయుడు ధర్నా చేపట్టారు. అనంతరం తహశీల్దార్‌ ఎస్‌.కిరణ్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో కె.గురునాయుడు, డి.మహాలక్ష్మినాయుడు, ఎం.నర్సింహులు, బి.అసిరప్పడు, సిహెచ్‌.పాపారావు, ఇ.బంగారి, తవిటినాయుడు, రామారావు పాల్గొన్నారు.
మందస తహశీల్దార్‌ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు, పి.దేవేంద్ర, టి.లక్ష్మీనారాయణ, సవర గురునాథ్‌, గణపతి, అప్పన్న, భీమారావు, కేశవరావు పాల్గొన్నారు.
కంచిలి తహశీల్దార్‌ వద్ద ధర్నా నిర్వహించిన తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పిట్ట కృష్ణ, రాజు, లచ్చయ్య, రఘు, కప్ప గోపినాథ్‌ పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరు మండలంలో నిర్వహించిన ధర్నాలో మండల కన్వీనర్‌ ఎన్‌.మోహనరావు, బి.ఆనందరావు, బి.రామకృష్ణ, బి.సుగుణావతి, ఎస్‌.సరోజనమ్మ, ఎన్‌.చంద్రయ్య, భైరాగి, ఈశ్వరమ్మ, పారమ్మ, డి.భాస్కరరావు, చింత దాలయ్య, హేమంత, యశోదమ్మ పాల్గొన్నారు. అనంతరం తహశీల్దార్‌ బి.అప్పలస్వామికి వినతిపత్రం అందించారు.
టెక్కలిలో నిర్వహించిన ధర్నాలో సిపిఎం నాయకులు నంభూరు షణ్ముఖరావు, కొల్లి యల్లయ్య, అప్పారావు, రమేష్‌, పోలయ్య, డేనియల్‌, నాగభూషణరావు, వేణుగోపాల్‌, బి.వాసు, డి.నేలవేణి, ముత్యాలమ్మ, తలాబి, సుహాసిని, వనజాక్షి, గంగులు పాల్గొన్నారు. అనంతరం తహశీల్దార్‌ ప్రవళ్లికాప్రియకు వినతిపత్రం అందించారు.
లావేరులో నిర్వహించిన ధర్నాలో సిపిఎం నాయకులు ఎన్‌.వి.రమణ, ఎం.గౌరీశంకర్‌, పి.దుర్గాప్రసాద్‌, పి.శ్రీనుబాబు, ఎం.అశోక్‌, ఎల్‌.నాగరాజు కె.రామోజీరావు, పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
మెళియాపుట్టిలో చేపట్టిన ధర్నాలో సిపిఎం జిల్లా కమిటీ నాయకులు పోలాకి ప్రసాదరావు జెన్ని రామకృష్ణ, పి.బాలరాజు, దామోదరర, నిరంజన్‌, గణేష్‌, భాస్కరరావు, లక్ష్మణరావు పాల్గొన్నారు. అనంతరం తహశీల్దార్‌ పి.సరోజనికి వినతిపత్రం అందజేశారు.
బూర్జ తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.నాగమణి, కె.అప్పలనాయుడు పాల్గొన్నారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
సోంపేటలో నిర్వహించిన ధర్నాలో పార్టీ నాయకులు సంగారు లక్ష్మీనారయణ, టి.పాపారావు, పి.సింహాచలం, దున్న యామయ్య, కె.నిర్మల, వై.గోపిక, కె.మోహిని, జి.రామారావు, సుధీర్‌కుమార్‌, శివ, దుర్యోధన, ఈశ్వరరావు పాల్గొన్నారు.
కొత్తూరులో నిర్వహించిన ధర్నాలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిర్ల ప్రసాద్‌, నిమ్మక అప్పన్న, టి.తెల్లన్న, రామయ్య, సురేష్‌, దుర్గారావు పాల్గొన్నారు.
నందిగారంలో తహశీల్ధార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం డిటి భాగ్యలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పి.సాంబమూర్తి, ఎం.దాలయ్య పాల్గొన్నారు.
పలాసలో చేపట్టిన ధర్నాలో నాయకులు ఎన్‌.గణపతి, వి.కృష్ణారావు, ఎస్‌.ఢిల్లేశ్వరి, ఎం.లావణ్య, పద్మ, వి.రజిని, జి.జ్యోతి, పార్వతి, భగవతి, జ్యోతిమహంతి, లలిత, హేమలత, పి.మీనా, సబితాపండా, ఎల్‌.లక్ష్మి, స్వాతి పాల్గొన్నారు. అనంతరం ఎల్‌.మధుసూదనరావుకు వినతిపత్రం అందజేశారు.