Jun 29,2023 00:06

సత్తెనపల్లిలో ధర్నా చేస్తున్న అఖిల పక్ష పార్టీలు

ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్‌ : వివిధ ఛార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్‌ భారాలను వేస్తున్న ప్రభుత్వం వాటిని వెంటనే రద్దు చేయాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం గుంటూరు-మాచర్ల రహ దారిపై ఆందోళన చేపట్టారు. అనంతర తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి తహశీల్దార్‌ సురేష్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా విజయకుమార్‌ మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 8 సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచి రూ.25 వేల కోట్ల భారాలను ప్రజలపై మోపిందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నాయన్నారు. గతంలో రెండు మూడేళ్లకు విద్యుత్‌ చార్జీలు పెంచేవారని, ఇప్పుడు కరెంటు బిల్లుతోపాటు ఫిక్స్డ్‌ ఛార్జీలు, కస్టమర్‌ ఛార్జీలు, సర్‌ ఛార్జీలు విద్యుత్‌ సుంకం, సర్దుబాటు ఛార్జీలు అంటూ జనాల్ని పీల్చి పిప్పి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయ కులు గద్దె చలమయ్య, పట్టణ, మండల కార్యదర్శులు డి.విమల, పి.మహేష్‌, కాంగ్రెస్‌ నాయకులు చుక్కా చంద్రపాల్‌, దాసరి జ్జానరాజ్‌ పాల్‌, టిడిపి నాయకులు డి.శ్రీనివాసరావు, ఎ.నాగేశ్వరరావు, బి.చం ద్రశేఖర్‌, జనసేన నాయకులు బి.అప్పా రావు, కె.సాంబశివరావు, ఆర్‌.సుమన్‌ కుమార్‌, సిపిఐ నాయకులు ఎన్‌.వేణుగో పాల్‌, జైభీమ్‌ భారత్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు జె.విజరు కుమార్‌ పాల్గొన్నారు.