Nov 05,2023 21:25

ప్రజాశక్తి - పాలకోడేరు
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పాలని సిపిఎం నాయకులు ఆంజనేయులు కోరారు. అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం చేపట్టిన ప్రజా రక్షణ భేరి ప్రచార జిల్లా జాతా ఆదివారం మండలంలో ప్రవేశించింది. శృంగవృక్షం నుంచి ప్రారంభమైన ఈ జాతా పెన్నాడ అగ్రహారం, గొరగనమూడి, విస్సాకోడేరు, భీమవరం వరకూ సాగింది. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఆంజనేయులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి శేషాపు అశ్రియ్య, నాయకులు పళ్లెం భీమన్న, కలిదిండి గోపాలరాజు, కొటికలపూడి శ్రీను, బాబ్జీ, షేక్‌ వలీ పాల్గొన్నారు.
వీరవాసరం :బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ విధానాలు నచ్చి రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేనలు ఆ పార్టీకి అనుకూలంగా ఉంటున్నాయని సిపిఎం ప్రజారక్షణ భేరి ప్రచార జాతా దళ నాయకులు ప్రశ్నించారు. ఈ జాతా ఆదివారం మండలంలోని రాయకుదురు, కొణితివాడ, ఉత్తరపాలెం, నవుడూరు, వీరవాసరం గ్రామాల గుండా సాగింది. ఈ సందర్భంగా దళ నాయకులు మాట్లాడుతూ ప్రజా స్వామ్యాన్ని కాపాడాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో ఈ ప్రచార జాత ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో దళ నాయకులు జవ్వాది శ్రీనివాసరావు, ఎం.ఆంజనేయులు, జుత్తిగ నరసింహమూర్తి, బొబ్బనపల్లి సూర్యచంద్రరావు, షేక్‌ వలీ, కేతా జ్యోతిబసు, నారాయణమూర్తి, కిలాడి సత్యనారాయణ, బొర్రా ఆలమహరాజు పాల్గొన్నారు.
పాలకొల్లు :రాష్ట్రానికి ద్రోహం చేసిన మతోన్మాద బిజెపిని, ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న పార్టీలను వ్యతిరేకించాలని మాజీ ఎంఎల్‌ఎ దిగుపాటి రాజగోపాల్‌ కోరారు. ప్రజారక్షణ భేరి ప్రచార జాతా ఆదివారం పాలకొల్లు చేరింది. ఈ సందర్భంగా పాత బస్టాండ్‌ వద్ద ప్రజా నాట్యమండలి కళాకారులు గీతాలు ఆలపించారు.ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్యమండలి కళాకారులు షేక్‌ వలీ, నిల్లి భార్గవ్‌, బురిడి శ్రీరాములు, సిపిఎం నేతలు బాతిరెడ్డి జార్జి, దేవ సుధాకర్‌, చల్లా సోమేశ్వరరావు, యడ్ల మోహన్‌రావు, పల్లి జార్జిబాబు, కుంచే రామచంద్రరావు పాల్గొన్నారు.
పోడూరు : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని తిప్పికొట్టాలని సిపిఎం జిల్లా నాయకులు ఆకుల హరే రామ్‌ ప్రజలను కోరారు. సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 15న విజయవాడలో జరిగే ప్రజా రక్షణభేరి ప్రచార యాత్ర ప్రజలంతా పాల్గొనాలని కోరుతూ జీపుజాతా తూర్పు పాలెం, పండిత విల్లూరు, పోడూరు మీదుగా మినిమించిలి పాడు చేరుకుంది. ఈ సందర్భంగా హరేరామ్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సుర్నీడి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి పిల్లి ప్రసాద్‌, మూడే మోజేసు, బూరాబత్తుల వెంకటేశ్వరరావు, కె.భాస్కరరావు, కాటూరి యాకోబు పాల్గొన్నారు.
యలమంచిలి : ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ప్రజా ప్రణాళిక జిల్లా ప్రచార జాతా ఆదివారం మండలంలోని ఏనుగు వానిలంక, కలగంపూడి, చించినాడ, యలమంచిలి, మేడపాడు గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కానేటి బాలరాజు మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన విజయవాడలో సిపిఎం బహిరంగ సభ నిర్వహిస్తుందని, ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ జాతాలో ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన గేయాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం ఈ జాతా అడవిపాలు మీదుగా పాలకొల్లుకు చేరింది. కార్యక్రమంలో నాయకులు జవ్వాది శ్రీనివాస్‌, మాసవరపు సుబ్బారావు, దేవ సుధాకర్‌, పల్లి జార్జి, బాబు ఎడ్ల మోహనరావు పాల్గొన్నారు.
ఆచంట : సిపిఎం చేపట్టిన ప్రజారక్షణ భేరి ప్రచారయాత్ర ఆదివారం సాయంత్రం ఆచంటకు చేరుకుంది. ఈ సందర్భంగా కచేరీ సెంటర్లో సిపిఎం జిల్లా నేత ఆకుల హరే రామ్‌ మాట్లాడుతూ రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపి విష కౌగిలి నుండి వైసిపి, టిడిప,ి జనసేన బయటికొచ్చి రాష్ట్ర ప్రయోజనం కోసం పోరాడాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు సూర్నీడి వెంకటేశ్వరరావు, వద్దిపర్తి అంజిబాబు, తోటపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.
పెనుగొండ : మండలంలో ప్రజా రక్షణ భేరి జాతా సిపిఎం జిల్లా నాయకులు ఆకుల హరే రామ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ యాత్రం పెనుగొండ మెయిన్‌ బజార్‌ రోడ్డు గోంగూర తూమ్‌ సెంటర్లో సాగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్‌.వెంకటేశ్వరరావు, కప్పల రత్నరాజు మాదాసు నాగేశ్వరరావు, నీలం ఆదినారాయణ, పి.రామారావు, సత్యనారాయణ పాల్గొన్నారు.