విశాఖ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు వ్యతిరేకంగా... సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో విశాఖలో బుధవారం నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు, సిపిఎం కార్పొరేటర్ 78 వ వార్డు బి.గంగారావు, ఐద్వా నాయకురాలు పి.మణి, మద్దిలపాలెం జోన్ సెక్రటరీ కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.










