Apr 19,2023 19:45

దేవనకొండలో మాట్లాడుతున్న గౌస్‌ దేశాయి

ప్రజాశక్తి - దేవనకొండ
కేంద్రంలోని మతోన్మాద బిజెపిని సాగనంపుదామని, దేశాన్ని కాపాడుకుందామని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌ దేశాయి, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బి.వీరశేఖర్‌, సిపిఐ మండల కార్యదర్శి నరసరావు, సిపిఐ మండల సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు కోరారు. బుధవారం సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార భేరి పాదయాత్ర మండలంలోని పొట్లపాడు, కుంకనూరు, మాచాపురం, పి.కోటకొండ గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజల బాధలు, అవస్థలు అర్థం చేసుకోవడం లేదని విమర్శించారు. ధరలు విపరీతంగా పెంచి, ప్రజలు బతకలేని దుస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రయివేట్‌పరం చేస్తూ అదాని, అంబానీలకు ఊడిగం చేస్తోందని విమర్శించారు. ప్రజల మధ్య మతవిద్వేషాలను సృష్టిస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని తెలిపారు. మరోపక్క ప్రయివేటీకరణను అమలు చేస్తూ, ప్రభుత్వ ఆస్తులన్నింటినీ అమ్మేసేందుకు పూనుకుందని విమర్శించారు. ప్రజాసంఘాల నాయకులు నెట్టేకల్‌, సూరి సంజన్న, మాబాష, సుభాన్‌, రామాంజనేయులు, భాస్కర్‌, నరేష్‌ పాల్గొన్నారు. కౌతాళంలోని పుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు వెంకటేశులు, సీనియర్‌ నాయకులు మల్లయ్య, మండల కన్వీనర్‌ వీరన్న, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకులు వీరేష్‌, సిపిఐ మండల కార్యదర్శి ఈరన్న, సిపిఎం నాయకులు వలీ, నారాయణ, రాందాసు పాల్గొన్నారు. మంత్రాలయం మండలంలోని చెట్నిహల్లి, మాధవరం గ్రామాల్లో కరపత్రాలను పంపిణీ చేశారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎమ్‌డి.అంజిబాబు, సిపిఐ జిల్లా నాయకులు భాస్కర్‌ యాదవ్‌, సిపిఎం మండల నాయకులు జయరాజు, సిపిఐ మండల నాయకులు లక్ష్మణ్‌ సింగ్‌, సురేష్‌, మారెప్ప పాల్గొన్నారు. ఆదోని పట్టణంలో నాయకులు సుదర్శన్‌, లక్ష్మన్న నాయకత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె.లక్ష్మారెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి బసాపురం గోపాల్‌, సిపిఎం జిల్లా నాయకులు పిఎస్‌.గోపాల్‌, తిప్పన్న హాజరై మాట్లాడారు. నాయకులు వెంకన్న, హుసేని, కల్లుబావి రాజు, ప్రకాష్‌, షేక్షావలీ, సాబీర్‌ బాష, కిషోర్‌, రమేష్‌ కుమార్‌, అంజిత్‌ గౌడ్‌, రామానాయుడు, తిక్కప్ప, నాగరాజు పాల్గొన్నారు. హాలహర్వి మండలంలో నాయకులు కెపి.నారాయణ స్వామి, కృష్ణ ఆధ్వర్యంలో ప్రచార భేరి నిర్వహించారు.