Feb 25,2023 22:43

ప్రజాశక్తి-పెనుగంచిప్రోలు 

సిపిఎం పెనగంచిప్రోలు మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ పాత సినిమా హాల్‌ సెంటర్‌లో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి వల్లభదాసు గురవయ్య మాట్లాడుతూ ఈనెల 1వ తేదీన మోడీ నాయకత్వాన కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజలకు నష్టం చేస్తూ ,కార్పొరేట్లకు మేలు చేస్తూ బడ్జెట్‌ ను ప్రవేశపెట్టిందని అన్నార. గత రెండేళ్లుగా కరోనా ప్రభావంతో అల్లాడిన కార్మికులకు, ఉద్యోగులకు, రైతులకు ,మహిళలకు, యువతకు, వివిధ సామాజిక తరగతులకు, సామాన్య ప్రజానీకానికి ఈ బడ్జెట్‌లో మేలు జరుగుతుందని పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయని విమర్శించారు. రాష్ట్ర విభజన తో నష్ట పోయిన మన రాష్ట్రంకు విభజన చట్టం హామీలకు ఈ బడ్జెట్‌ లో కేటాయింపులు లేవని, వాటిని సవరించాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు ధారా నాగేశ్వరరావు ఎర్రబోల్‌ రామారావు బాలు నాయక్‌ అంకులు వరమ్మ తదితరులు పాల్గొన్నారు.