Nov 18,2023 00:00

మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి సాలోమన్‌ ఆరోక్యరాజ్‌

ప్రజాశక్తి-గుంటూరు : కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో జరుగుతున్న వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సక్రమంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి, జిల్లా ప్రభరీ అధికారి సాలోమన్‌ ఆరోక్యరాజ్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీసీ సమావేశ మందిరంలో వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో సాలోమన్‌ ఆరోక్యరాజ్‌, జిల్లా కలెక్టర్‌ ఎం వేణుగోపాల్‌ రెడ్డి, సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారితో కలసి పాల్గొన్నారు. జిల్లాలో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్‌ ఎం వేణుగోపాల్‌ రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజేంటేషన్‌ ద్వారా వివరిస్తు జిల్లాలో 258 గ్రామాల్లో 60 రోజుల్లో, గుంటూరు , తాడేపల్లి మంగళగిరి నగరపాలక సంస్థలతో పాటు తెనాలి, పొన్నూరు మున్సిపాల్టీలలో 40 ప్రాంతాల్లో 20 రోజుల్లో సంకల్ప యాత్రను జిల్లాకు కేటాయించిన రెండు ప్రచార వాహనాలు ద్వారా కార్యక్రమాలు నిర్వహించేలా షెడ్యూల్‌, రూట్‌ మ్యాప్‌ రూపొందించామన్నారు. కేంద్ర ప్రభుత్వం 17 పధకాలకు సంబంధిత శాఖ జిల్లా స్థాయి అధికారిని నోడల్‌ ఆఫీసర్‌ గా నియమించటం జరిగిందన్నారు.జనవరి 26 వరకూ ఈ యాత్ర నిర్వహించాలని సాలోమన్‌ఆరోక్యరాజ్‌ పేర్కొన్నారు. సమావేశంలో డిఆర్‌ఒ కె.చంద్రశేఖర్‌రావు, జెడ్పీ సిఇఒ జె.మోహనరావు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.