Apr 18,2023 16:27

ప్రజలకు బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పిస్తున్న సిపిఎం నాయకులు

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక  నిరంకుశ పాలనకు చమర గీతం పాడాలి : సిపిఎం
ప్రజాశక్తి-డోన్
   
దేశంలోని మతతత్వ బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చూద్దాం ప్రజలు  చమర గీతం పాడాలని సీపీఎం పట్టణ మండల కార్యదర్శులు నక్కిశ్రీకాంత్,కె.నాగరాజు లు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని వైయస్సార్ నగర్ లో 5 రోజు ప్రచార బేరి పాదయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం సందర్భంగా సిపిఎం పార్టీ పట్టణ మండల కార్యదర్శులు నక్కిశ్రీకాంత్, కె.నాగరాజు లు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలను దోచుకోవడం తప్ప ప్రజలకు ఎటువంటి మేలు చేయలేకపోయిందని అందుకు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకొని పోయి ఎండగట్టడానికి ఈ యొక్క క్యాంపియన్ చేపడుతున్నామని అన్నారు. బిజెపి కార్పొరేట్ మతోన్మాద విధానాలను ప్రజలకు తెలియజేయాలని ఆర్థిక విధానాలు అధిక ధరలు నిరుద్యోగం ప్రైవేటీకరణ జీఎస్టీ బారాలు ఇవన్నీ ప్రజల మీద విలయతాండవం చేస్తున్నాయని ఈ విధానాల వల్ల సామాన్య మానవుడు బ్రతికే పరిస్థితుల్లో కనబడడం లేదని, అందుకే బిజెపి దేశానికి రాష్ట్రానికి ద్రోహం చేస్తుందని అన్నారు. భారతదేశంలో రాఫెల్ ఆదాని కుంభకోణం అదేవిధంగా రాజ్యాంగం పై దాడి  జరుగుతుందని ప్రజల్లోకి తీసుకొని పోతున్నామని తెలిపారు.మన రాష్ట్రానికి బిజెపి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విద్రోహాన్ని ఎలుగెత్తి చాటాలని రాష్ట్రానికి ప్రత్యేక హోదా,విజన హామీలు అమలు చేస్తామన్న బిజెపి పార్టీ ఇంతవరకు అమలు చేయకపోవడం అదేవిధంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ,కడప ఉక్కు ఫ్యాక్టరీ,రాజధాని నిర్మాణం వెనకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వకపోవడం వీటన్నిటి పైన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ప్రజలకు తీసుకొని  పోయి ఎండగట్టుతామన్నారు.ఇదేదాకా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచిందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ద్వారా షరతులు విధించి వివిధ అదనపు భారాలు మోపిందని అన్నారు. ఉదాహరణకు విద్యుత్ చార్జీలు పెంపు,చెత్త పన్ను, ఆస్తి పన్ను,వ్యవసాయ మీటర్లకు మోటర్లు బిగించడం ఇలాంటివన్నీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విధానాలను అంగీకరించి ప్రజలకు ద్రోహం చేస్తుందని అన్నారు.కేంద్ర, ప్రభుత్వం రాష్ట్రానికి  ఇంత ద్రోహం చేస్తున్న పల్లెత్తు మాట కూడా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనడం లేదు అని అన్నారు.అదేవిధంగా దేశంలో రాష్ట్రంలో మతోన్మాదం పెరిగిపోతుందని, మైనార్టీలపై దాడులు ,దళితులపై దాడులు జరుగుతున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోరు ఎత్తడం లేదని అన్నారు.టోటల్గా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుందని భారతదేశం మోడీ అమిత్ ఆదాని కంపెనీలాగా భారతదేశ మారుతుందని అన్నారు.కాబట్టి భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని అందుకే కేంద్ర ప్రభుత్వ ,ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకుని పోయి దేశాన్ని కాపాడుకోవాలని అన్నారు.ఈ ప్రచార క్యాంపి యన్లో ప్రజలందరూ బాగా స్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో,శ్రీరామ నగర్ సీపీఎం శాఖ కార్యదర్శి షేమిమ్ బేగం, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి నక్కి హరి,ఎస్ ఎఫ్ ఐ మండల అధ్యక్షులు అశోక్, మహిళ సంఘం నాయకురాలు అమృత,మాధవి,ఉస్సేనుబీ,డివైఎఫ్ఐ నాయకుల లు చరణ్ పాల్గొన్నారు.