
రాయచోటి టౌన్ : 2021 అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరీలో రైతుల హత్యాకాండలో ప్రధాన కుట్ర దారైన కేంద్ర మంత్రి అజరు మిశ్రా తెనీని తక్షణమే పదవి నుంచి తొలగించి, ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా బ్లాక్ డే కార్యక్రమం కిస్తాన్ మోర్చా (ఎస్‌కెఎం), కేంద్ర కార్మిక సంఘాలు, సమాఖ్యలు సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట బ్లాక్‌డే నిర్వహించారు. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని, బిజెపి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి చేస్తున్న చేటును వ్యతిరే కించాలని, లఖింపూర్‌ఖేరీలో రైతుల మతికి కారణ మైన అశీష్ మిశ్రాపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ లఖిం పూర్‌ఖేరీ దాడిలో నలుగురు రైతులు చనిపోవడం వెనుక మంత్రి ఆయన కుమారుడు అశీష్ మిశ్రా పాత్ర ఉందని, వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ జరిగిన ఐక్య రైతు ఆందోళనను అణచివేయడానికి బిజెపి పన్నిన కుట్ర అని విమర్శించారు. గత రెండేళ్లలో ప్రధాని మోడీ అజరు మిశ్రాను డిస్మిస్ చేయడం కానీ, రాజీనామా చేయాలని కోరడం గానీ జరగలేదని ఎఫ్‌ఐఆర్‌లో మంత్రి పేరు వున్నప్పటికీ ప్రధాని ఆయనను రక్షిస్తున్నారని ఆరోపించారు. సుప్రీం జోక్యం తర్వాతనే యుపి ప్రభుత్వం అశీష్ మిశ్రాను, ఇతర నిందితులను అదుపులోకి తీసు కుందని, వారితో పాటూ అమాయకులైన రైతులను కూడా అరెస్టు చేశారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య రీతిలో ఉద్యమాలు జరుపుతున్న వారిపై జరిగే అణచివేత, దాడులకు నిరసనగా బ్లాక్‌డే ఎస్‌కెఎం, సంయుక్త వేదికలు పిలుపునిచ్చాయని, ఈ ఉద్యమానికి సిపిఎం జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను తీవ్రంగా నిరసించాలని పిలుపునిచ్చారు. చారిత్రక రైతు పోరాటం సందర్భంగా రైతులపై పెట్టిన తప్పుడు కేసులను ఇప్పటికైనా ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు గిట్టుబాటు ధరలు అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ రంగంలోని మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించి వ్యవసాయ రంగాన్ని నాశనం చేయాలని చూస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని రైతాంగం అందరికీ ఉన్న వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్లకు లక్షలాది కోట్ల రూపాయలను రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వాలు రైతులకు ఎందుకు చేయవని ప్రశ్నించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పి. ఎల్.నరసింహులు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలోని మోటార్లకు స్మార్ట్ మీటర్లను వ్యతిరే కించాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి చేటు తెస్తున్న విధానాలను వ్యతిరే కించాలని, అందుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో ప్రజలు మద్దతుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రంగారెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి భాగ్యలక్ష్మి, ఉపాధ్యక్షులు రమణ, జిల్లా కమిటీ సభ్యులు ఫయాజ్, కెవిపిఎస్ జిల్లా నాయకులు వెంకటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కష్ణప్ప, డి.హెచ్.పి.హెచ్ నాయకులు సుధీర్, శ్రీనివాసులు పాల్గొన్నారు.