మదనపల్లె అర్బన్ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ గిరీష అన్నారు. బుధవారం ఎస్‌పి గంగాధర్‌రావు, ఎమ్మెల్యే నవాజ్‌బాషాతో కలిసి కలెక్టర్ బిటి.కళాశాల గ్రౌండ్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం గడ్కరీ చేతుల మీదుగా సత్సంగ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలోని స్వస్త్య హాస్పిటల్ ప్రారంభోత్సవ కానుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర మంత్రి మధ్యాహ్నం రెండు గంటలకఉ మదనపల్లె హెలిపాడ్‌కి చేరుకుంటారని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా సత్సంగ్ ఫౌండేషన్ వారి స్వస్త్య హాస్పిటల్‌కు చేరుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో ఎటువంటి లోపాలు జరగకుండా కార్యక్రమం విజయవంతమయ్యేలా పనులను చేపట్టాలనిసంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమానంతరం రోడ్డు మార్గం ద్వారా హెలిపాడ్‌కు చేరుకుంటారని అక్కడ నుంచి తిరుపతికి వెళతారన్‌ి తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, మదనపల్లి ఆర్‌డిఒ మురళి, మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమీల పాల్గొన్నారు.బిటి గ్రౌండ్‌లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్, ఎస్‌పి, అధికారులు










