Sep 22,2023 00:33
సమస్యలు తెలుసుకుంటున్న కేంద్ర బృందం సభ్యులు

ప్రజాశక్తి-కోటవురట్ల:మండలంలో జరుగుతున్న జల్‌ జీవన్‌ మిషన్‌ పనులపై గురువారం జాతీయ బృందం జగ్గంపేట శివారు కె.బి అగ్రహారం గ్రామంలో పర్యటించారు. సుశీల్‌ కుమార్‌ చౌబే, ఇష్‌ వర్‌ చంద్జైన్‌ ఆధ్వర్యంలో జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా జరిగిన పనులను పరిశీలించారు. గ్రామంలో సరఫరా అవుతున్న నీటి వివరాలు వాటిలో ఉండాల్సిన మినరల్స్‌ మోతాదు, సహజ నీటి వనరులు, సంపద సృష్టి కేంద్రాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, గ్రామ సర్పంచ్‌ రమణ, డిప్యూటీ ఇంజనీర్‌ నాగేశ్వరరావు, మండల గ్రామీణ నీటి సరఫరా అధికారి గీతాంజలి, కరుణ పాల్గొన్నారు.