Feb 04,2023 00:19

ప్రజాశక్తి-ఎటపాక
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కి వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో మండలంలోని గుండాల కాలనీలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి ఐవి మాట్లాడుతూ కేంద్ర బి.జె.పి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో పోలవరం నిర్వాసితులకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. ఆహార సబ్సిడీలోనూ, రైతుల సబ్సిడీలోనూ, మధ్యాహ్న భోజన పథకంలోనూ, పేదలకు ఉపశమనం కలిగించే అన్ని రకాల పథకాల్లోనూ బిజెపి ప్రభుత్వం కోతలు విధించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు డి.మాధవరావు, ఐ.పద్మ, పార్టీ నాయకులు తోట శ్రీను, సుధాకర్‌, ప్రవీణ్‌, కె.వెంకట్‌ సాయి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.