Oct 08,2023 00:00

విదేశీ విద్యా మేళాను ప్రారంభిస్తున్న కెఎల్‌ యు రిజిస్ట్రార్‌, డీన్‌

తాడేపల్లి రూరల్‌: కెఎల్‌ డీమ్డ్‌ యూనివర్శిటీలో ఆయా కోర్సులు చదువుతున్న విద్యార్థులకు విదేశీ యూనివర్శిటీలలో ప్రత్యేక రాయితీలతో పాటు ఉపకార వేతనాలు కూడా అందిస్తున్నారని కెఎల్‌ అంతర్జాతీయ పౌర సంబంధాల డీన్‌ డాక్టర్‌ ఎం.కిషోర్‌బాబు అన్నారు. శనివారం వర్శిటీ లోని సాక్‌ హాలులో నిర్వహించిన విదేశీ విద్యా మేళాను రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.సుబ్బారావు లాంఛనంగా ప్రారం భిం చారు. ప్రపంచం నలు మూలల నుంచి వచ్చిన ముప్ఫై కి పైగా యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించాలనుకుంటున్న వంద లాది మంది విద్యార్ధులు వారి తల్లిదండ్రులతో వచ్చి తమ సందేహాలను నివృతి చేసుకున్నారు. ఉన్నత విద్యకు వేసుకోవలసిన ప్రణాళిక, ఏ చదువుకు ఎలాంటి పరీక్షలు రాయ వలసి ఉంటుందనే అంశాలతో పాటు ఉత్తమ ర్యాంక్‌ ఉన్న యూనివర్సిటీ లో చేరాలంటే ఏ పరీక్ష లో ఎన్ని మార్కులు సాధించానే విషయాలను ఆయా యూని వర్సిటీల ప్రతినిధులు విద్యార్థులకు, తల్లిదండ్రులకు వివరించారు. కిషోర్‌బాబు మాట్లాడుతూ కెఎల్‌ యూని వర్శిటీలో చదువుతున్న విద్యార్దులు ఉన్నత చదువుల కోసం విదేశీ విశ్వవిద్యాలయాలలో చేరాలనుకునే వారికి ఫీజు రాయితీలతో పాటు ఉపకార వేతనాలను కూడా పెద్ద ఎత్తున అందిస్తున్నారని అన్నారు. అమెరికా నుండి మియామి యూనివర్శిటీ, సెయింట్‌ లూయిస్‌ యూని వర్శిటీ, హార్ట్‌ ఫోర్డ్‌ యూనివర్శిటీతో పాటు మరో ఇరవై ఐదు విశ్వవిద్యాలయాలు కెఎల్‌ యూనివర్శిటీ విద్యా ర్థులకు అడ్మిషన్లు ఇవ్వడానికి పోటీ పడ్డాయన్నారు. సుమారు వెయ్యి మంది విద్యార్థులు ఆయా దేశాలకు చెందిన యూనివర్శిటీలలో చేరేందుకు ఆసక్తి చూపినట్లు చెప్పారు. కార్యక్రమంలో కెఎల్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ జి.పార్థసారథి వర్మ, ప్రో వైస్‌ ఛాన్సలర్లు డాక్టర్‌ ఎవిఎస్‌.ప్రసాద్‌, డాలర్ల ఎన్‌.వెంకట్‌ రామ్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.సుబ్బారావు, డైరెక్టర్‌ విజరు మారుతి పాల్గొన్నారు.