
తాడేపల్లి రూరల్: కెఎల్‌యు పూర్వ విద్యార్థిని, ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖను బుధవారం కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీ విద్యార్థి సంక్షేమ విభాగాధిపతి డాక్టర్ చప్పిడి హనుమంత రావు దుశ్శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సం దర్బంగా ఆయన మాట్లాడుతూ చైనాలో ఇటీవల ముగిసిన ఆసియా క్రీడలు 2023 విలు విద్యలో మూడు బంగారు పతకాలను గెలుచుకుని అద్భుతమైన విజయాన్ని సాధించిందని అన్నారు. కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీలో ఆమె సిఇసి తో పాటు ఎంబిఎ కూడా పూర్తి చేసిందని అన్నారు. జ్యోతి సురేఖ తమ వర్శిటీ పూర్వ విద్యార్థిగా ఉండడం తమకు ఎంతో గర్వకారణమన్నారు. కెఎల్ వర్శిటీలో చదువుతున్న పలువురు క్రీడా కారులకు తాము ఉచిత విద్యనందించడంతో పాటు పలు రకాల ఉపకార వేత నాలను కూడా అందిస్తున్నట్లు తెలిపారు. వడ్డేశ్వరంలోని గ్రీన్ ఫీల్డ్ క్యాంపస్ లోని విద్యర్దులందరూ జ్యోతి సురేఖను కలిసి కరచాలనం చేస్తూ అభినందనలు తెలిపారు. కార్య క్రమంలో వైస్ చాన్సలర్ డాక్టర్ జి.పార్ధసారధి వర్మ, ప్రో వైస్ చాన్సలర్లు డాక్టర్ ఎవిఎస్.ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంక ట్ రామ్, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, సిఇసి విభా గాధిపతి డాక్టర్ పవన్ కుమార్ పాల్గొన్నారు.