Dec 27,2022 22:51

ప్రజాశక్తి-విజయవాడఅర్బన్‌: విద్యార్ధులకు నైపుణ్య అభివద్దిని అందించడంలో కెఎల్‌ విశ్వవిద్యాలయం అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నుండి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు లభించిందని విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ జి.పార్ధసారధివర్మ తెలిపారు. విజయవాడ లోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అంతర్జాతీయ, జాతీయ కంపెనీలలో ప్లేసెమెంట్స్‌ వచ్చేలా, అలాగే ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేలా ప్రత్యేక నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని వీటి ఫలితంగానే గత విద్యా సంవత్సరంలో ప్లేసెమెంట్స్‌ కోసం శిక్షణ పొందిన విద్యార్దులు వంద శాతం ఉద్యోగాలను పొందారని, అలాగే తమ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న అనేకమంది అద్యాపకులకు , మెంటార్లకు కూడా ఆయా రంగాలలో ఎక్స్‌ లెన్స్‌ అవార్డులు కూడా రావడం సంతోషకరమైన విషయమన్నారు. ఈ నెల 23న న్యూఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో భారత ప్రభుత్వ విద్య మరియు నైపుణ్యాభివద్ధి మంత్రిత్వ శాఖ ఛైర్మన్‌ ముఖ్య అతిథిగా హాజరై కెఎల్‌ విశ్వవిద్యాలయానికి ఆలిండియా మొదటి ర్యాంకును ప్రదానం చేసినట్లు తెలిపారు. నైపుణ్యాభివద్ధి విబాగం డీన్‌ డాక్టర్‌ ఎ.శ్రీనాధ్‌ మాట్లాడుతూ ఇంటర్న్‌ షిప్‌ లు, ఉద్యోగాల కల్పనల ఫలితాలలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న సంస్థగా 2022 కు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో కెఎల్‌ విశ్వవిద్యాలయం లో పనిచేస్తున్న అధ్యాపకులు ఉత్తమ అవార్డులను పొందినట్లు ఆయన ప్రకటించారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న నైపుణ్య అభివద్ది, ఇంటర్న షిప్‌ లకు, ఉద్యోగాల కల్పనల ప్రక్రియకు మార్గదర్శకత్వం వహించి, ప్రతి విద్యార్ధిని ప్రోత్సహించి , ప్రతి విద్యార్థికి అవసరమైన శిక్షణను సకాలంలో పూర్తి చేయడం కోసం ప్రత్యేక శ్రద్ధ వహించి, ఉత్తమ ఫలితాలను సాధించినందుకు గాను విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ జి.పార్ధసారధివర్మ ఎక్సలెన్స్‌ అవార్డును అందుకోగా, నైపుణ్య అభివద్ది మరియు విద్యార్ధుల పురోగతి డీన్‌ డాక్టర్‌ ఎ శ్రీనాథ్‌ కి డీన్‌ ఎక్సలెన్స్‌ అవార్డు లబించింది. విశ్వవిద్యాలయ మెంటార్లు డా. చందన్‌, డాక్టర్‌ నిలు సింగ్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ చందన్‌, పాలో ఆల్టోకు 2022వ సంవత్సరాని ఉత్తమ భోదనా మరియు మెంటర్లుగా అవార్డు పొందారని తెలిపారు. అదేవిధంగా కెఎల్‌ హైదరాబాదు క్యాంపస్‌ లో మెంటార్‌లుగా వ్యవహరించిన అధ్యాపకులు ఎడబ్ల్యుఎస్‌కు సిఎస్‌ఇ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కె శ్రీనివాస్‌, డాక్టర్‌ సిహెచ్‌ రాధికా రాణి, జూనిపర్‌ లకు కూడా ఉత్తమ బోధన మరియు మెంటార్లు గా అవార్డులు అందుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్మిషన్స్‌ విభాగం డైరెక్టర్‌, డాక్టర్‌ జె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.