Feb 03,2023 23:01

ప్రజాశక్తి-ఎ.కొండూరు 

మండలంలోని ఎ.కొండూరు కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాన్ని శుక్రవారం ఎన్టీఆర్‌ జిల్లా సమగ్ర శిక్ష ఏపీసి మహేశ్వరరావు, సీఎం ఓ టి రాంబాబు, జి సి డి ఓ శాంతి ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేజీబీవీలో జరుగుతున్న నాడు-నేడు ఫేజ్‌-2 పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ప్రిన్సిపాల్‌ షేక్‌ మీరున్నిసాను, పంచాయతీరాజ్‌ ఏఈ సాంబశి వరావును ఆదేశించారు. అనంతరం పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినులతో సమావేశమై విద్యా నైపుణ్యాలను పరిశీలించి, ఏప్రిల్‌లో నిర్వహించే పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో కష్టపడి చదివి నూటికి నూరు శాతం ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. పాఠశాలలో 8వ తరగతి బాలికలకు పంపిణీ చేసిన ట్యాబ్స్‌ బైజూస్‌ కంటెంట్‌ వినియోగించే తీరును పరిశీలించారు. అనంతరం పాఠశాలలో మౌలిక వసతులు, భోజన సదుపాయాలను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. ఇంటర్‌ బోధిస్తున్న అధ్యాపకులు తమకు జీతాలు పెంచాలని వినతిపత్రం సమర్పించారు. ఎంఇఒ ఎం.రాజశేఖర్‌, ప్రిన్సి పాల్‌ షేక్‌ మీరున్నిసా, సీఆర్పీలు నాగపండు పాల్గొన్నారు.