Jul 07,2023 20:19

పరీక్షలను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

ప్రజాశక్తి - కోసిగి రూరల్‌
కోసిగిలో మఠం బ్రదర్స్‌, ఆర్లబండ సహకార సంఘం అధ్యక్షులు మహాంతేష్‌ స్వామి, వైసిపి యువజన నాయకులు జగదీష్‌ స్వామి వారి కేదారి ల్యాబ్‌ అండ్‌ డయాగ్నోస్టిక్‌ కేంద్రాన్ని ఎమ్మెల్యే వై.బాలనాగి రెడ్డి, వైసిపి మండల ఇన్‌ఛార్జీ మురళీమోహన్‌ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మండల ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా అందుబాటులో అధునాతన పరికరాలతో రక్త పరీక్షలు చేపట్టడం శుభపరిణామమని తెలిపారు. అనంతరం పరీక్షల వివరాలను స్వయంగా తెలుసుకున్నారు. ఎస్‌ఐ రాజారెడ్డి, ఎంపిపి ఈరన్న, బెట్టనగౌడ్‌, శ్రీనివాసరెడ్డి, ఎన్‌.నాగరాజు, మంగమ్మ, బుళ్లి నరసింహులు, మల్లికార్జున గౌడ్‌, ఖలీల్‌ అహ్మద్‌, జంపాపురం బసిరెడ్డి పాల్గొన్నారు.