ప్రజాశక్తి - విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని కష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం 69వ అఖిల భారత సహకార వారోత్సవాలు నిర్వహించారు. ఈసందర్బంగా కష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఛైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ సహకార యూనియన్ చైర్మన్ దేశిరెడ్డి రాఘవరెడ్డి పతాకాన్ని ఆవిష్కరించారు. సహకారసంఘం, సహకార శాఖ ఉద్యోగస్తులకు, రైతులకు సహకార వారోత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో బ్యాంకు జిఎం రంగబాబు, కష్ణా జిల్లా సహకార బ్యాంకు చీఫ్ మేనేజర్లు, మేనేజర్లు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.










