Aug 11,2023 21:57

మృతి చెందిన రమణ

కురుపాం : కడుపునొప్పి తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మతి చెందిన సంఘటన స్థానిక మేజర్‌ పంచాయతీలో గల శివన్నపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం శివన్నపేటకు చెందిన నెలిపురి రమణ (45) అనారోగ్యంతో బాధపడుతూ కడుపు నొప్పి తాళలేక పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను బంధువులు స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మతిచెందాడని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.