May 04,2023 00:25

ప్రజలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కన్నబాబురాజు

ప్రజాశక్తి-అచ్యుతాపురం
మండలంలోనిపూడిమడక శివారు కడపాలెం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం బుధవారం ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు, ఆయన కుమారుడు యు.సుకుమార్‌ వర్మ చేపట్టారు. గడపగడపకు తిరిగి మత్స్యకారులను కలిసి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన సబ్సిడీ పథకాలను ఎంత మొత్తంలో లబ్ధిదారులకు అందాయో ఆయన చదివి వినిపించారు. పక్కా ఇళ్లు లేకపోతే మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ చేపల సుహాసిని, జెడ్పిటిసి సభ్యులు, మండలంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, నాలుగు మండలాలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే కన్నబాబు రాజు
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని బుధవారం ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు, ఆయన కుమారుడు, డిసిసిబి మాజీ చైర్మన్‌ యు.సుకుమార్‌ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సాలువతో సత్కరించారు.