కడప అర్బన్ : కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర హకైన కడప ఉక్కుపై చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టడం కోసం కడప ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో కడప వేదికగా రాష్ట్ర స్థాయి సదస్సు ఈ నెల 18న నిర్వహిస్తున్నట్లు డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం చిన్ని, వీరణాల శివకుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి కడప ఉక్కు సదస్సుకుకు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న, ఉక్కు సాధన ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు బి.నారాయణ, డివైఎఫ్‌ఐ మాజీ జిల్లా నాయకులు చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాపితంగా డివైఎఫ్‌ఐ యువజన సంఘం నాయకత్వం హాజరవుతున్నారన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఏ విధంగా పోరాడారో ఇప్పుడు కడప ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం రాష్ట్ర వ్యాప్తం గా ఆనందించడమే సదస్సు ప్రాముఖ్యత అన్నారు.కేంద్ర ప్రభుత్వం కడప ఉక్కును పూర్తిగా విస్మరించిందని దానికి పార్లమెంటులో చెప్పిన ప్రకటనే నిదర్శన మన్నారు. విభజన హక్కు కడప ఉక్కు అన్నారు. ఈ సదస్సు ను యువత పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నగర అధ్యక్ష, కార్యదర్శులు షాకీర్, డి.ఎం. ఓబులేసు, ఉపాధ్యక్షులు విజరు పాల్గొన్నారు.










