మూడేళ్లుగా నత్తనడకన పనులు
జిల్లాకు 309 భవనాలు మంజూరు
118 మాత్రమే పూర్తి
వివిధ దశల్లో మరికొన్ని భవనాలు
ప్రజాశక్తి-రాయచోటి : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అన్ని రకాల సేవలు ఒకేచోట ఉందుబాటలో ఉండాలనే సంకల్పంతో గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వం హెల్త్ సెంటర్లును మంజూరు చేసింది. వాటికి సంబంధించిన నిర్మాణాల ఎక్కువ చోట్ల కదలిక వివిధ దశలలో నిలిచిపోయాయి. జిల్లాలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండడం, కొన్నిచోట్ల స్థలాల సేకరణ ఆలస్యం కావడం, కోర్టు, వివిధ కారణాల వల్ల హెల్త్ సెంటర్ల పనులు మూడేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వం 309 హెల్త్ సెంటర్లను మంజూరు చేసింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 118 సెంటర్లు మాత్రమే పూర్తయ్యాయి. 10 భవనాలకు కనీసం పునాదులు కూడా తీయలేదు. ఉపాధి హామీ పథకం (కన్వర్జెన్సీ) నిధులతో సొంత భవనాలు నిర్మించాలన్నదే ప్రభుత్వం ఉద్దేశ్యం. హెల్త్ సెంటర్ నిర్మాణ పనుల బాధ్యతను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి బాధ్యతలు అప్పగించారు. 2020 మేలో ఒక్కో భవనానికి రూ .17.50 లక్షల చొప్పున జిల్లాలో 309 భవనాలకు రూ.54.60 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాతో నిధులు మంజూరు చేసింది. వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. 10 భూ వివాదాలు, కోర్టు, కాంట్రాక్టు ముందుకు రాక పోవడం వంటి వివిధ కారణాలతో పనులు ఇప్పటి వరకు మెదలు పెట్టలేదు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో 52 హెల్త్ సెంటర్లు మంజూరు కాగా మట్టి తీసినవి 1, పునాదులు 16, గోడలు 8, స్లాబ్ 1, పూతల 5 పూర్తయినవి 21. రైల్వేకోడూరు నియోజకవర్గంలో 66 హెల్త్ సెంటర్లు మంజూరు కాగా మొదలు పెట్టినవి 4, మట్టి తీసినవి 3, పునాదుల 12 ,గోడలు 7, స్లాబ్ 9, పూతల 10, పూర్తయినవి 17. మదనపల్లి నియోజకవర్గంలో 35 హెల్త్ సెంటర్ల మంజూరు కాగా ఇప్పటి వరకు మొదలు పెట్టినవి 1, మట్టి తీసినవి 0, పునాదుల 12, గోడలు 9, పూతలు 7, పూర్తయినవి 4. పీలేరు నియోజకవర్గంలో 56 హెల్త్ సెంటర్ మంజూరు కాగా మొదలు పెట్టినవి 0, మట్టి తీసినవి 0, పునాదులు 3, గోడలు 8, స్లాబుల 3, పూతల 15, పూర్తయినది 27. రాజంపేట నియోజకవర్గంలో 38 హెల్త్ సెంటర్ల మంజూరు కాగా ఇప్పటివరకు మొదలుపెట్టని 4, మట్టి తీసినవి 1, పునాదులు 8, గోడలు 0 ,స్లాబ్లు 4, పూతల 1, పూర్తయినవి 19. రాయచోటి నియోజకవర్గం 62 హెల్త్ సెంటర్ మంజూరు కాగా ఇప్పటి వరకు మొదలు పెట్టనవి 1, మట్టి తీసినవి 3, గోడలు 6 , స్లాబులు 5 , పూతలు 7, ఇప్పటివరకు పూర్తయినవి 30. మిగిలిన వివిధ దశలలో నిలిచిపోయాయి. ఇప్పటి వరకు 38 శాతం మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన సెంటర్లు పూర్తి కావాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందోనని పలువురు విమర్శిస్తున్నారు. చేసిన పనులకు సకాలంలో బిల్లు రాకపోవడంతో కాంట్రాక్టర్లు మిగిలిన పనులను వదిలేస్తున్నారు. హెల్త్ సెంటర్లు వసతి సమస్య కారణంగా పూర్తి సేవలు ప్రజలకు అందించాలని వైద్య సిబ్బంది అంటున్నారు. ప్రజలకు సూచనలు సలహాలు, వైద్యం అందించాలిన్న సరైన ఏర్పాటు లేకపోగా ఇరుకు గదులలో ఇబ్బందిగా ఉందని వైద్య అధికారులు వాపోతున్నారు. ప్రభుత్వం సెప్టెంబర్ నాటికి హెల్త్ సెంటర్లను వంద శాతం పూర్తి చేయాలని సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంది. జిల్లాలో సకాలంలో హెల్త్ సెంటర్లు కేంద్రాలు పూర్తిస్థాయిలో అవుతాయో లేదో వేచి చూడాలిసందే .
వేగవంతం చేస్తాం
జిల్లాలో హెల్త్ సెంటర్ భవన నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నాం. మండల ఇంజినీర్లతో సమీక్షించి సమావేశాలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం బిల్లుల కూడా సకాలంలో అందుతున్నాయి. సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి స్థాయిలో హెల్త్ సెంటర్లును పూర్తి చేయాలినే లక్ష్యంతో పనిచేస్తున్నాం.
- కె.జె.ఎస్.చంద్రారెడ్డి, పిఆర్ ఎస్‌ఇ, రాయచోటి.










