గొర్రెలకు, మేకలకు వైద్యం చేస్తున్న డాక్టర్ అశోక్ కుమార్
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు రూరల్
మండలంలోని కడివెళ్ల గ్రామంలో గొర్రెలకు, మేకలకు మంగళవారం ఉచిత వైద్యం శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పశువైద్యాధికారి డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడారు. మండలంలోని కడివెళ్ల గ్రామంలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 2.0 పథకం కింద గొర్రెలకు, మేకలకు ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. అనారోగ్యంగా ఉన్న గొర్రెలు, మేకలకు చికిత్స అందించి ఉచిత మందులు ఇచ్చినట్లు చెప్పారు. విఎల్‌ఒ వైకుంఠ వాసులు, వాటర్‌షెడ్ టిఒ శివ, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.










