సమస్యను తెలుసుకుంటున్న అధికారులు
ప్రజాశక్తి-రోలుగుంట:ఇటీవల డోలిమోతల కారణంగా పెదగరువు గ్రామానికి చెందిన ఒక శిశువు మృతి చెందిన నేపధ్యంలో జిల్లా కలెక్టర్ స్పందించారు. రోడ్డు నిర్మాణం కోసం సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో, శనివారం అధికారులు ఉరుకులు పరుగులు తీశారు. మండలంలో వైబి.పట్నం నుండి లోసింగి మీదుగా పెదగరువు వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర రహదారి ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ రవిపట్టన్‌శెట్టి ఆదేశాల మేరకు శనివారం డివిజన్, మండల స్థాయి అధికారులు పర్యటించారు. పెదగరువు నుండి లోసింగి మీదుగా వైబి.పట్నంనకు రహదారి ఏర్పాటుకు సర్వే అధికార యంత్రాంగం సర్వే నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి ప్రసాదరావు, పంచాయతీ డిఇ ప్రసాద్, పంచాయతీరాజ్ ఎఇ ఉమా మహేశ్వరుడు, డిటి త్రివేణి పాల్గొన్నారు.










