
ప్రజశక్తి - చీరాల
చంద్రబాబు మీటింగులకు, లోకేశ్ యువగళం పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణను కట్టడి చేయాలనే దుర్బుద్దితో అక్రమ అరెస్టులు చేశారని టిడిపి ఇన్చార్జి ఎంఎం కొండయ్య అన్నారు. వైసిపి అరాచకాలు ప్రజలు చూస్తున్నారని అన్నారు. టిడిపికి ప్రజలు బ్రహ్మరధం పడతారని అన్నారు. దీక్షలో టిడిపి రాష్ట్ర కార్యదర్భులు సలగల రాజశేఖర్, నాతాని ఉమామహేశ్వరరావు, మత్స్యకార నాయకుడు బందు గురవయ్య, గరికిన చిన్న, ఓసిపిల్లి తాతారావు, కుక్కల రమణబాబు, కొక్కిలగడ్డ గోపి, ఎరిపిల్లి సింహాద్రి, గరికిన బాలాజీ, చోడిపిల్లి బంగారురాజు, పార సునీల్, గరికన యాకోబు, గరికిన నవీన్, చేపల సైమన్, క్రష్, పౌలు పాల్గొన్నారు.