Nov 05,2023 21:20

జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి
ప్రజాశక్తి - కాళ్ల
ఓటర్ల జాబితాలో ఎటువంటి తప్పుల్లేకుండా కచ్ఛితమైన జాబితా తయారు చేయాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి బిఎల్‌ఒలను ఆదేశించారు. పెదఅమిరం గ్రామంలో స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌లో భాగంగా జరుగుతున్న స్పెషల్‌ కాంపెయిన్‌ను జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి సందర్శించారు. మెయిన్‌ ప్రాథమిక పాఠశాలల్లోని 162,163,164 పోలింగ్‌ కేంద్రాలను ఆమె పరిశీలించారు. కొత్త ఓటరు కార్డుల నమోదు, ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టరు సిబ్బందిని ఆదేశించారు. పోలింగ్‌ సమయంలో ఓటర్ల జాబితాలకు సంబంధించి పూర్తి బాధ్యత బిఎల్‌ఒలదేనని తెలిపారు. జాబితాలో అక్కడక్కడా ఫొటోలు లేకుండా ఉన్న ఓటర్లను గమనించి ఫొటోలను తప్పకుండా అప్లోడ్‌ చేయాలని సూచించారు. ఫారం - 6, ఫారం-8 ఎన్నెన్ని వచ్చాయి, ఎలా పరిష్కరించారని జిల్లా కలెక్టరు ప్రశ్నించారు. వందేళ్లు దాటిన వారు ఎంత మంది ఉన్నారని అడిగారు. అర్హులందరినీ ఓటర్లుగా చేర్పించాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి కోరారు. కలెక్టరు వెంట జిల్లా పంచాయతీ శాఖ అధికారి జివికె మల్లికార్జునరావు, తహశీల్దారు టిఎ.కృష్ణారావు, విఆర్‌ఒలు గుర్రం చిట్టిబాబు, బిఎల్‌ఒలు పాల్గొన్నారు.
భీమవరం రూరల్‌ : తప్పుల్లేని ఓటర్ల జాబితా రూపొందించడానికి బిఎల్‌ఒలు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. ఆదివారం పురపాలక సంఘం పరిధిలో చింతలపాటి బాపిరాజు ఉన్నత పాఠశాల, రూరల్‌ గ్రామం గొల్లవానితిప్పలో ఏర్పాటుచేసిన స్పెషల్‌ సమ్మరీ రివిన్‌లో భాగంగా జరుగుతున్న స్పెషల్‌ కాంపెయిన్‌ను కలెక్టరు ఆకస్మిక తనిఖీ చేశారు. పోలింగ్‌ సమయంలో ఓటర్ల జాబితా పూర్తి బాధ్యత బిఎల్‌ఒలదేనని తెలిపారు. కలెక్టరు వెంట ఆర్‌డిఒ కె.శ్రీనివాసులు రాజు, తహశీల్దార్‌ వై.రవికుమార్‌, బిఎల్‌ఒలు పాల్గొన్నారు.
మొగల్తూరు : లోపాలు లేకుండా ఓటరు జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి సిబ్బందికి ఆదేశించారు. ముత్యాలపల్లిలో పోలింగ్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించారు. ఓటర్ల జాబితాలను పరిశీలించి బిఎల్‌ఒలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్‌ సమయంలో ఓటర్ల జాబితాల పూర్తి బాధ్యత బిఎల్‌ఒలదేనన్నారు. జాబితాలో ఫొటోలు లేకుండా ఉన్న ఓటర్లను గమనించి ఫొటోలను తప్పకుండా అప్లోడ్‌ చేయాలని ఆమె సూచించారు. డెత్‌ ఓటర్లు డూప్లికేషన్లు లేకుండా చూడాలన్నారు. అర్హులందరినీ ఓటర్లుగా చేర్పించాలన్నారు. కలెక్టర్‌ వెంట ఆర్‌డిఒ ఎం.అచ్యుత అంబరీష్‌, తహశీల్దారు జి.అనితా కుమారి ఉన్నారు.