Jul 26,2023 21:10

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
గ్రామాల్లో కచ్ఛా డ్రెయినేజీలు ఏర్పాటు చేయాలని సిపిఎం మండల కన్వీనర్‌ ఇంజేటి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. వెంప గ్రామంలోని కొత్తపేటలో ఇంజేటి శ్రీనివాస్‌ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల వల్ల రోడ్లపై నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కచ్ఛా డ్రెయినేజీలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.