Oct 02,2023 00:10

కబ్జాదారుల నుండి రక్షించండి..


కబ్జాదారుల నుండి రక్షించండి..
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):2018లో ఎన్టీఆర్‌ గహకల్పన ద్వారా చంద్రగిరి ఇందిరమ్మ కాలనీ సర్వే నెంబర్‌ 1115లో రెండు సెంట్లు స్థలాన్ని ప్రభుత్వం మంజూరు చేసిందని, ఈ స్థలంలో ఇంటి నిర్మాణం కోసం బేస్‌ మతాన్ని కూడా హౌసింగ్‌ ద్వారా నిర్మించు కొని 20 వేల రూపాయలు కూడా పొందామని బాధితురాలు లిల్లీ పుష్ప తెలిపారు. ఆదివారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అయితే ఇటీవల చంద్రగిరి కాపు వీధికి చెందిన టిడిపి నాయకుడు తులసి కర్ణాటక రాష్ట్రానికి చెందిన దేవి శ్రీ అలియాస్‌ సెల్వి అనే మహిళకు తనకు మంజూరు చేసిన పట్టా స్థలాన్ని చూపించి అమ్మేశారని చెబుతున్నారని, దీనిపై స్థానిక ఎమ్మార్వో ను కలిసిన, పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్థలాన్ని ఎలా అమ్ముతారు అని తులసిని ప్రశ్నిస్తే కుల దూషణలు చేస్తున్నారని, నీకు దిక్కున చోట చెప్పుకో అని బెదిరిస్తున్నారని కన్నీరు మున్నీరయ్యారు. తమకు కేటాయించిన స్థలాన్ని తమకు దక్కేలా రెవెన్యూ ఉన్నత అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కుమార్‌ పాల్గొన్నారు.