ప్రజాశక్తి-నందిగామ: అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా దళిత చైతన్య వేదిక, స్నేహ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్‌జిఒ హోమ్ ఆవరణలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కన్నెకంటి సజ్జన్ రావు, పెసరమల్లి శేఖర్‌రావు, ఆర్డీవో రవీంద్ర, కమిషనర్ డాక్టర్ జయరాం తదితరులు పాల్గొన్నారు.










