సత్తా చాటిన విద్యార్థులతో స్పోర్ట్ అధికారి, డైరెక్టర్
ప్రజాశక్తి -నర్సీపట్నం రూరల్:జిల్లా స్థాయి జగనన్న క్రీడా సంబరాలలో భాగంగా నిర్వహించిన కబడ్డీ పోటీల్లో నర్సీపట్నం నియోజకవర్గం టీమ్ ప్రథమ స్థానం సాధించింది. గురువారం ఈ పోటీలు అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగాయి. ఏడు నియోజకవర్గాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. నర్సీపట్నం నియోజకవర్గం నుండి కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ పోటీల కు వెళ్లగా కబడ్డీ పోటీల్లో బాలికలు ఫైనల్స్లో పాయకారావుపేట టీమును ఓడించి పధమ స్థానం సాధించింది. క్రీడాకారులను జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ సూర్యారావు, శాప్ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు, శాప్ కోచ్ అబ్బు అభినందించారు.










