Oct 21,2022 22:52

ప్రజాశక్తి-కంచికచర్ల
మండల పరిధిలోని పరిటాల పరిధిలో గల అమ్రిత సాయి ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు ప్రో కబడ్డీ లీగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచారని కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ కె. రామ్మోహన రావు తెలిపారు. ఇటీవల కే.యల్‌ యూనివర్సిటీ లో సామ్యాక్‌ - 22 పేరు తో నిర్వహించిన నేషనల్‌ లెవెల్‌ టెక్నో మేనేజ్మెంట్‌ ఫెస్ట్‌ లో ప్రో కబడ్డీ పోటీలలోతమ కళాశాల కబడ్డీ జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రెండవ స్థానం కైవసం చేసుకుందన్నారు. జాతీయ స్థాయిలో జరిగిన ఈ పోటీలలో మొత్తం 16 జట్లు తలపడగా అమ్రిత సాయి కబడ్డీ జట్టు ఫైనల్‌ మ్యాచ్‌ లో మంచి ప్రదర్శన చేసి ప్రో కబడ్డీ లీగ్‌ లో రన్నర్స్‌ గా నిలిచి ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భం గా శుక్రవారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విజేతలను రామ్మోహనరావు, సీఈఓ డాక్టర్‌ కె .సాయి మనోజ్‌ , ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం. శశిధర్‌, అధ్యాపకులు అభినందించారు.