Oct 11,2023 01:04
విద్యార్థిని అభినందిస్తున్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి-కర్లపాలెం: ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్‌జిఎఫ్‌ స్కూల్‌ గేమ్స్‌ అండర్‌-19 కబడ్డీ పోటీలలో పికేఆర్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థి పి మణికంఠ ఎంపికైనట్లు కళాశాల పిడీ వెంకట్‌ తిరుపతి రెడ్డి తెలిపారు. ఈ నెల ఆరో తేదీన చేబ్రోలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరిగిన ఉమ్మడి గుంటూరు జిల్లా కబడ్డీ పోటీలలో కర్లపాలెం మండలంలో ఉన్న పీకేఆర్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థి కబడ్డీ పోటీలలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయిన సందర్భంగా సోమవారం కళాశాల ప్రిన్సిపాల్‌ డీజే నాయుడు రెడ్డి కళాశాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో కబడ్డీ పోటీలలో ఎంపికైన విద్యార్థికి అధ్యాపక బృందం అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా పికేఆర్‌ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డిజే నాయుడురెడ్డి మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ సెలక్షన్‌ పోటీలలో కళాశాల విద్యార్థి పాల్గొంటారని తెలిపారు.