Aug 16,2023 19:49

ప్రశంసాపత్రం అందుకుంటున్న విద్యార్థి

ప్రజాశక్తి - కౌతాళం
కౌతాళంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థి నవ్యను ఎస్పీ జి.కృష్ణకాంత్‌ ప్రశంసించారని కెజిబివి ప్రిన్సిపల్‌ పుష్పలత తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడారు. కర్నూలు నగరంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ఆధ్వర్యంలో 9వ తరగతి చదువుతున్న నవ్య నేతృత్వంలో పాఠశాలకు చెందిన 10 మంది బాలికలు మార్చ్‌ ఫాస్ట్‌ పెరేడ్‌లో పాల్గొన్నారని తెలిపారు. ఎస్పీ కృష్ణకాంత్‌ నవ్యకు మెడల్‌ అందించి అభినందించినట్లు చెప్పారు. బాలికలు విద్యతోపాటు అన్ని రంగాల్లోనూ రాణించే విధంగా తీర్చిదిద్దాలని సూచించినట్లు తెలిపారు.