Nov 27,2022 23:48

విద్యార్థినులను అభినందిస్తున్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి -యంత్రాంగం
ఆనందపురం : మండలంలోని నేలతేరు కస్తూరిబా గాంధీ విద్యాలయం విద్యార్థులు కౌశల్‌ క్విజ్‌ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. భారతీయ విజ్ఞాన మండలి ఆధ్వర్యాన రామనాధ్‌ సెకండరీ స్కూల్‌, ఎన్‌ఎస్‌టిఎల్‌లో శనివారం క్విజ్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు పాల్గొన్నాయి. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం విధ్యార్థినులు బి.గాయత్రి (8వ తరగతి), బి.శ్రావణ లక్ష్మి (9వ తరగతి), ఎన్‌.భారతి (10వ తరగతి) టీమ్‌ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి క్విజ్‌ పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం ప్రిన్సిపల్‌ చంద్రకళ, ఉపాధ్యాయులు అభినందించారు.
పద్మనాభం : పద్మనాభం కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో 9వ తరగతి చుదువుతున్న మొకర సిరి జిల్లా స్థాయి కౌశల్‌ సైన్స్‌ పోటీల్లో ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైందని పాఠశాల ప్రత్యేక అధికారి గ్రేష్‌ లిల్లి తెలిపారు. విద్యార్థిని సిరిని ఉపాధ్యాయులు అభినందించారు.